logo
Updated : 29/11/2021 05:46 IST

చిత్ర వార్తలు

ప్రకృతి ఒడిలో హాయిగా..


విజయవాడ సమీపంలోని సూరంపల్లి మామిడి తోటలో జరిగిన కార్తిక వనసమారాధనలో కబడ్డీ ఆడి సందడి చేసిన నగర డిప్యూటీ మేయర్‌ అవుతు శైలజ

కార్తికమాసం ఆఖరి ఆదివారం కావడంతో నగరవాసులు వనాల బాట పట్టారు. సమీపంలోని తోటల్లోకి సకుంటుంబ సమేతంగా వెళ్లి ఆహ్లాదంగా గడిపారు. రోజువారీ పనుల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందారు. స్నేహితులు, బంధువులతో ముచ్చటించారు. చెట్ల కింద భోజనాలు చేశారు. ఆటలతో సందడి చేశారు.

- భవానీ ద్వీపంలో కనిపించిన దృశ్యాలివి.

- ఈనాడు, అమరావతి


దుర్గమ్మ సేవలో స్పీకర్‌ తమ్మినేని దంపతులు

 

రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం సతీ సమేతంగా ఆదివారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో డి.భ్రమరాంబ, ఆలయ ఛైర్మన్‌ పైలా సోమినాయుడులు స్వాగతం పలికారు. వేద పండితులు అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు చేయగా.. తమ్మినేని దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో, ఛైర్మన్‌ స్పీకర్‌ దంపతులకు అమ్మవారి ప్రసాదాలను, చిత్రపటాలను అందజేశారు.

- న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్‌


ముఖ్యమైన దారి.. ఘోరంగా మారి..!

రోడ్డు పక్కనే  భారీ గుంత

విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి అమరావతి సచివాలయానికి ముఖ్యమంత్రి, సీఎస్‌, ఇతర అధికారులు వెళ్లే ప్రముఖ రహదారి ఇది. సీతానగరం దారి గుంతలుపడింది. కొండవీటి వాగు వంతెనపై పరిస్థితి అధ్వానంగా ఉంది. ఒకేసారి ఎదురెదురుగా వాహనాలు రాకపోకలు సాగించలేవు. ఉండవల్లి కరకట్టపైన రహదారి గుంతలు పడి, చీలిపోయింది. అంచుల్లో భారీ గుంతలు ఏర్పడి, ప్రమాదకరంగా మారాయి. ఈ దారిలోనే ముఖ్యమంత్రితోపాటు సీఎస్‌, ఇతర ఉన్నతాధికారులు నిత్యం వెళ్తున్నారు. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు నుంచి మందడం మీదుగా సచివాలయానికి వెళ్లే దారి కూడా బాగోలేదు. వాహనాలు కిందకి దిగే వీలు లేకుండా పెద్ద గుంతలు పడ్డాయి. సీసీ రోడ్డుపై తారు వేయడంతో అంతా జారిపోయి గుంతలు కనిపిస్తున్నాయి.


కరకట్ట రోడ్డులో గొయ్యి వద్ద ప్రమాద సూచికగా..

ప్రకాశం బ్యారేజీ- సీతానగరం దారి..

- ఈనాడు, అమరావతి


గాజుల అలంకరణ...తిరుపతమ్మ దీవెన

కార్తిక మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారిని లక్ష గాజులతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సహ దేవతలైన అంకమ్మ, మద్దిరావమ్మ, చంద్రమ్మ దేవతామూర్తులను కూడా గాజులతో అలంకరించారు. లక్ష గాజులను ఏపీ బెవరేజస్‌ ఎండీ డి.వాసుదేవరెడ్డి, ఖమ్మంకు చెందిన విష్ణుమొలకల లక్ష్మీప్రసాద్‌ విరాళంగా అందించారు. వారిని ఆలయ ఛైర్మన్‌ చెన్నకేశవరావు సత్కరించారు. పూజల్లో సర్పంచి వేల్పుల పద్మకుమారి పాల్గొన్నారు.

- పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే


ఆకట్టుకున్న శునకాల ప్రదర్శన


కుక్కల్ని మైదానంలోకి తీసుకొస్తున్న యజమానులు

మొగల్రాజపురంలోని సిద్ధార్థ పబ్లిక్‌ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ప్రదర్శనలో వివిధ రకాల జాతుల శునకాలు సందడి చేశాయి. నగరంతో పాటు వివిధ రాష్ట్రాలు, రష్యా, బ్రెజిల్‌ దేశాలకు చెందిన 120 జాతుల శునకాలు పాల్గొన్నాయి. వివిధ వాహనాల్లో వాటిని యజమానులు తీసుకొచ్చారు. వాటిని నడిపించుకుంటూ ప్రదర్శించారు. వీక్షికులు ఆసక్తిగా తిలకించారు. నిర్వాహకులు పృధ్వీకృష్ణ, అన్వేష్‌, వీరభద్రరరావు పాల్గొన్నారు.

-న్యూస్‌టుడే, మొగల్రాజపురం (విజయవాడ సిటీ)


నివాళి

మహాత్మా జ్యోతిరావు ఫులె వర్ధంతిని పురస్కరించుకుని మున్సిపల్‌ కార్పొరేషన్‌ అతిథిగృహం ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి నివాళులర్పిస్తున్న రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే ముస్తఫా, జడ్పీ ఛైర్‌పర్సన్‌ క్రిస్టినా తదితరులు


కోటప్పకొండపై భక్తజన కోలాహలం

కార్తిక మాసం చివరి ఆదివారం కావడంతో కోటప్పకొండపై త్రికోటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మూలవిరాట్టుకు 292 అభిషేకాలు చేశారు. ప్రత్యేక దర్శనాలకు 2300 టిక్కెట్లు విక్రయించారు. కోటప్పకొండలోని పలు సామాజిక వర్గాల అన్నదాన సత్రాల్లో కార్తిక వనసమారాధన సందడి నెలకొంది. అనంతరం వారు స్వామిని దర్శించుకున్నారు. కార్తిక మాసం ప్రారంభమైన తర్వాత ఎక్కువ సంఖ్యలో భక్తులు కొండకు రావడం ఇదే ప్రథమమని దేవస్థాన అధికారులు తెలిపారు.

- నరసరావుపేట అర్బన్‌, న్యూస్‌టుడే


సూర్యలంక కిటకిట

కార్తిక మాసం చివరి ఆదివారం కావడంతో హైదరాబాద్‌, జిల్లా నలుమూలల నుంచి సూర్యలంకకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. బీచ్‌లో సందడి వాతావరణం నెలకొంది. యువత, పిల్లలు సముద్ర స్నానం చేసి కేరింతలు కొట్టారు. వర్షాన్ని సైతం

లెక్కచేయకుండా తీరంలో సంతోషంగా గడిపారు.

- న్యూస్‌టుడే, బాపట్ల


పిలుపు కోసం పడిగాపులు

ప్రసవం అయిన తర్వాత పిలుస్తారనే ఆశతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లేబరు వార్డు వద్ద సహాయకులు ఇలా పడిగాపులు కాస్తున్నారు. లోపల తల్లీబిడ్డలకు ఏదైనా అవసరమైతే అందుబాటులో ఉండాలని అక్కడే నిద్రపోతున్నారు. ఎండైనా, వానైనా వీరికి ఇక్కడ నీడ లేదు.

- ఈనాడు, అమరావతి

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని