logo
Published : 29/11/2021 05:31 IST

పేదలకు చేరువగా సంక్షేమ పథకాలు : కలెక్టర్‌


ఎలుకలను పట్టే బుట్టలను పరిశీలిస్తున్న నివాస్‌

గురజాడ (పమిడిముక్కల), న్యూస్‌టుడే: ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందేలా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టరు జె.నివాస్‌ అన్నారు. ఆదివారం గురజాడ శివారులోని యానాదులకాలనీని ఆయన సందర్శించారు. పొలాల్లో బుట్టలు పెట్టి ఎలుకలను పట్టి రైతులిచ్చిన సొమ్ముతో జీవిస్తుంటామని వారు తెలపగా ఆ బుట్టలను తెప్పించి ఆసక్తిగా పరిశీలించారు. వృద్ధాప్య, వితంతు పింఛన్లు ఇతరాలు అందుతున్నాయా అని అడిగారు. అమ్మ ఒడి పథకం అందుతోందా అని ప్రశ్నించగా తమ పిల్లలకు కుల, జనన ధ్రువీకరణ పత్రాలు లేవని వారు బదులిచ్చారు. దీంతో అక్కడి వాలంటీరును, అధికారులను పిలిచి వారికి కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు అందించాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి సూచనలిచ్చారు. బడి బయట ఉన్న ఆరుగురు పిల్లల తల్లిదండ్రులతో అమ్మ ఒడి పథకం గురించి చెప్పగా వారు తమ పిల్లలను బడికి పంపేందుకు అంగీకరించారు. కాలనీలోని పేదలందరికీ నివేశన స్థలాలు మంజూరయ్యాయని, ప్రభుత్వం ఇచ్చే సొమ్ముతోపాటు మరికొంత చేర్చి త్వరలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయిస్తామని అధికారులు తెలిపారు. తహసీల్దారు కట్టా వెంకట శివయ్య, ఎంపీడీవో ఏఎన్‌వీ నాంచారరావు, సర్పంచి జంపాన వెంకటేశ్వరరావు, ఎంపీపీ కాసాని వేదసుప్రజ తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని