logo

చిత్ర వార్తలు

శ్రీమతి అమరావతి- 2021 అందాల పోటీ విజేతగా చంద్రిక ఎంపికయ్యారు. రన్నరప్‌గా అర్చన, రెండో రన్నరప్‌గా జెస్లీన్‌ నిలిచారు. తేజాస్‌ ఎలైట్స్‌ ఆధ్వర్యంలో సీజన్‌-6 గ్రాండ్‌ ఫినాలే శనివారం...

Updated : 05 Dec 2021 05:45 IST

అమరావతి అందాలు అదరహో

శ్రీమతి అమరావతి గ్రాండ్‌ ఫినాలేలో.. ర్యాంప్‌వాక్‌ చేస్తున్న మహిళలు

శ్రీమతి అమరావతి- 2021 అందాల పోటీ విజేతగా చంద్రిక ఎంపికయ్యారు. రన్నరప్‌గా అర్చన, రెండో రన్నరప్‌గా జెస్లీన్‌ నిలిచారు. తేజాస్‌ ఎలైట్స్‌ ఆధ్వర్యంలో సీజన్‌-6 గ్రాండ్‌ ఫినాలే శనివారం ఉత్సాహంగా సాగింది. శ్రీమతులు ర్యాంపుపై హోయలొలికిస్తూ ఆహూతులను అలరించారు. సినీ నటి ప్రియ, గత ఏడాది విజేత ఉమా హైనీ చేతుల మీదుగా విజేతలు ట్రోఫీలు అందుకున్నారు. మరో సినీ నటి మాధవీలత హాజరయ్యారు. పోటీలకు ‘కళాంజలి’ స్పాన్సర్‌గా వ్యవహరించింది.

- న్యూస్‌టుడే, కరెన్సీనగర్‌


హర హర మహాదేవ

ర్శింగపాడులో ఆదిదంపతులైన శ్రీగంగాఅన్నపూర్ణాదేవి, పార్వతీదేవిలతో మరకతలింగ చంద్రమౌళీశ్వరస్వామి కల్యాణం శనివారం రాత్రి కనుల పండువగా జరిగింది. అనంతరం జరిగిన తెప్పోత్సవ కార్యక్రమానికి భక్తులు పోటెత్తారు.  దీపకాంతులు తేజోమయ పుంజాలై నలుదిశలా వ్యాపించడంతో ఆలయ ప్రాంగణం కాంతులీనింది. మహిళలు పుష్పాలతో అలంకరించిన శివలింగాకారం ఆకట్టుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని