Published : 06 Dec 2021 01:35 IST
ఉరేసుకొని హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య
శివనాగేశ్వరరావు (పాత చిత్రం)
పామర్రు, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా చందర్లపాడు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నడకుదుటి శివనాగేశ్వరరావు స్థానిక మేనకా స్టూడియో బజారులో నివాసం ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఆయన ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్.ఐ. అవినాష్ తెలిపారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని శవ పరీక్ష కోసం గుడివాడ ఏరియా వైద్యశాలకు తరలించామన్నారు. అనుమానాస్పంద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
Tags :