logo

ఎన్జీవో సంఘం అధ్యక్షుడిపై అవిశ్వాసం

ఏపీ ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడిపై ఈసీ సమావేశంలో అవిశ్వాసం పెట్టి తొలగించి నూతన అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ఇప్పుడు ఉద్యోగ సంఘాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని అన్ని యూనిట్లు ఆదివారం గుంటూరు

Published : 06 Dec 2021 02:56 IST

నూతన అధ్యక్ష, కార్యదర్శులు ఘంటసాల శ్రీనివాసరావు, సతీష్‌కుమార్‌లను అభినందిస్తున్న సంఘ నాయకులు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: ఏపీ ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడిపై ఈసీ సమావేశంలో అవిశ్వాసం పెట్టి తొలగించి నూతన అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ఇప్పుడు ఉద్యోగ సంఘాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని అన్ని యూనిట్లు ఆదివారం గుంటూరు నగరంలోని ఎన్జీవో కార్యాలయంలో సమావేశమయ్యాయి. ఈ సమావేశానికి రాష్ట్ర శాఖ నుంచి పరిశీలకులుగా ఇద్దరు హాజరైన సమావేశంలో ఇప్పటి వరకు పని చేస్తున్న అధ్యక్షుడిపై అవిశ్వాసం పెట్టారు. సమావేశానికి అతను హాజరుకాకపోవడంతో కోఆప్షన్‌ విధానంలో ఎన్నికలు జరిపారు.

రాష్ట్ర నాయకులపై వ్యాఖ్యలే కారణం : ఏపీ ఎన్జీవోల సంఘం జిల్లా కార్యవర్గం ఏర్పాయ్యాక కూడా టి.వి.రామిరెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నారు. అప్పట్లో జిల్లా కేంద్రానికి దూరంగా విధులు నిర్వహిస్తున్నారు. జిల్ల్లా కేంద్రంలో విధులు నిర్వహించేందుకు వచ్చాక అప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న రాంబాబును వేర్వేరు కారణాలతో పక్కనపెట్టారు. అప్పుడు రామిరెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కమిటీ ఏర్పాటు సమయంలోనే త్వరలో రామిరెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వస్తారని ప్రచారం జోరుగా జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన ఇటీవల రాష్ట్ర నాయకులపై కొన్ని వ్యాఖ్యలు చేశారని ఉద్యోగ సంఘాల్లో చర్చ. ఈ విషయంలోనే రాష్ట్ర శాఖ తరపున జిల్లాలో విచారణ కూడా చేసినట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర నాయకత్వం తరపున ఇద్దరు పరిశీలకులు ఆదివారం జిల్లాకు వచ్చారు. ఈసీ సమావేశం నిర్వహించగా అధ్యక్షుడిగా పని చేస్తున్న రామిరెడ్డి సమావేశానికి గైర్హాజరయ్యారు. పరిశీలకులు కె.జగదీశ్వరరావు, రంజిత్‌నాయుడు సమక్షంలో కో ఆప్షన్‌ ద్వారా ఎన్నిక నిర్వహించగా సంఘ జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్న ఘంటసాల శ్రీనివాసరావును జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అదేవిధంగా కార్యదర్శిగా శెట్టిపల్లి సతీష్‌కుమార్‌, మహిళా కార్యదర్శిగా శివజ్యోతిని ఎన్నుకున్నారు. ఈమేరకు ఎన్జీవో సంఘం తరపున ప్రకటన విడుదల చేశారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా  : జిల్లాలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శాయశక్తులా పని చేస్తానని అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుంచి రాష్ట్ర కార్యవర్గం పిలుపునిచ్చిన ఆందోళన కార్యక్రమాలను రాష్ట్ర కార్యవర్గ సూచనల మేరకు జిల్లాలోనూ నిర్వహిస్తామన్నారు. అన్ని యూనిట్లను సమన్వయం చేసుకుని సమస్యల పరిష్కారంలో ముందుకు సాగుతానని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని