logo

తెలుగుజాతికి వన్నె తెచ్చిన ఎన్టీఆర్‌

 తెలుగువారి ఆత్మగౌరవం కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్‌ అని, తెలుగుదేశం పార్టీని స్థాపించి.. తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకుని తెలుగుజాతికి వన్నె తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కిందని

Published : 19 Jan 2022 03:31 IST

రక్తదానం చేస్తున్న సాయికృష్ణ, చిత్రంలో ఆనందబాబు, శ్రావణ్‌కుమార్‌, రాజా, నసీర్‌, తదితరులు

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: తెలుగువారి ఆత్మగౌరవం కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్‌ అని, తెలుగుదేశం పార్టీని స్థాపించి.. తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకుని తెలుగుజాతికి వన్నె తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కిందని తెదేపా నేతలు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు, గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నగర పార్టీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌, గుంటూరు తూర్పు ఇన్‌ఛార్జి మహమ్మద్‌ నసీర్‌, పశ్చిమ ఇన్‌ఛార్జి కోవెలమూడి రవీంద్ర తదితరులు ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. ఆనందబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్‌ బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు రూపొందించారన్నారు. తెలుగుజాతి ఉన్నంత కాలం ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఆయన చేపట్టిన పేదలకు కూడు, గూడు, జనతా వస్త్రాలు, రూ.2కే కిలో బియ్యం వంటి సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కిందన్నారు. ఆలపాటి రాజా మాట్లాడుతూ సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో పేదరికం లేని సమాజానికి బాటలు వేసి తెలుగు ప్రజల ఆరాధ్యదైవంగా వెలుగొందారన్నారు. మహమ్మద్‌ నసీర్‌ మాట్లాడుతూ జాతీయ రాజకీయాల్లోనూ ఎన్టీఆర్‌ తన ప్రత్యేకతను చాటుకున్నారన్నారు. గుంటూరు పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణతో పాటు పలువురు తెలుగు యువత నాయకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు మాణిక్యరావు, రాజామాస్టర్‌, శ్రీనివాసరావు, శివప్రసాద్‌, శివరామయ్య, బుచ్చిరాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని