logo

నగర కమిషనర్‌గా ఐఏఎస్‌ అనురాధ బదిలీ?

గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ బదిలీ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నేడో, రేపో బదిలీ ఉత్తర్వులు వెలువడనున్నాయి. నూతన కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారి నియమితులయ్యారని నగరపాలకవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Published : 19 Jan 2022 03:31 IST

నేడో, రేపో ఉత్తర్వులు
ఈనాడు, అమరావతి

గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ బదిలీ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నేడో, రేపో బదిలీ ఉత్తర్వులు వెలువడనున్నాయి. నూతన కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారి నియమితులయ్యారని నగరపాలకవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గుంటూరు నగరపాలిక కన్నా కాకినాడ, నెల్లూరు చాలా చిన్నవి. వాటికే ఐఏఎస్‌లు కమిషనర్లుగా ఉన్నారని, గుంటూరుకు ఐఏఎస్‌ను నియమించాలని మేయర్‌ కావటి శివమనోహర్‌నాయుడు ప్రభుత్వ వర్గాలను కోరుతున్నారు. మరోవైపు కమిషనర్‌గా అనురాధ రెండేళ్లకు పై నుంచి కొనసాగుతున్నారు. ఆమెకు అదనపు డైరెక్టర్‌గా పదోన్నతి రావడంతో మరేదైనా శాఖలో ఆ హోదాలో పనిచేయాలని బదిలీ కోరుకున్నట్లు సమాచారం. ఏలూరు నగరపాలక కమిషనర్‌ పోస్టు ఖాళీగా ఉందని, అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. నూతన కమిషనర్‌గా పశ్చిమగోదావరి జిల్లాలో జేసీగా పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారి హిమాన్షు శుక్లాను నియమించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. గతంలోనూ గుంటూరు కమిషనర్లుగా అనేక సందర్భాల్లో ఐఏఎస్‌లు పని చేశారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతం కావడం విశాఖ, విజయవాడ తర్వాత అతిపెద్ద నగరపాలక కూడా ఇదే కావడంతో ప్రభుత్వం సైతం ఐఏఎస్‌ అధికారిని నియమించడానికి మొగ్గుచూపినట్లు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని