logo

వేతనాల చెల్లింపులో వివక్ష తగదు

ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు కూడా వేతనాలు చెల్లించాలని ప్రభుత్వ ఒప్పంద, పొరుగు

Published : 20 Jan 2022 03:15 IST

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న మున్సిపల్‌ ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు కూడా వేతనాలు చెల్లించాలని ప్రభుత్వ ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల ఐకాస సెక్రటరీ జనరల్‌ బి.ముత్యాలరావు అన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట మున్సిపల్‌ ఉద్యోగులు బుధవారం ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం చెల్లించకుంటే చలో విజయవాడ నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్‌సీలో ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు వేతనాల చెల్లింపులో వివక్ష చూపారని విమర్శించారు. ప్రభుత్వం పునరాలోచన చేసి సమస్యలు పరిష్కరించాలన్నారు. సమావేశంలో ఐకాస కో-ఛైర్మన్‌ బి.లక్ష్మణరావు, సీఐటీయూ నాయకులు వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, శివయ్య, పద్మ, కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

పీఆర్‌సీ రద్దుకు దశలవారీ ఆందోళనలు

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్‌సీలో 23 శాతం ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏలో శ్లాబ్‌ల తగ్గింపును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 21న ఏపీ ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో పంచాయతీరాజ్‌ శాఖ ఉద్యోగులు పాల్గొనాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు కోరారు. నూతన పీఆర్‌సీతో ఉద్యోగులకు తీవ్ర నష్టం చేకూరుతుందన్నారు. దశల వారీగా చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాల్లో పీఆర్‌ ఉద్యోగులు పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి హక్కులను కాపాడుకోవాలని కోరారు.

నేటి కలెక్టరేట్‌ ముట్టడికి మద్దతు

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రభుత్వ ప్రకటించిన పీఆర్‌సీతో ఉద్యోగులకు జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఫిట్‌మెంట్‌ను పెంచడం, హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌లను రద్దు చేయాలని కోరుతూ ప్యాఫ్టో ఆధ్వర్యంలో గురువారం ఉదయం 9.45 గంటలకు నిర్వహించనున్న జిల్లా కలెక్టరేట్‌ ముట్టడికి రాష్ట్ర పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం మద్దతు ఇస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. పంచాయతీరాజ్‌ ఉద్యోగులు ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఏపీ జేఏసీలు, ఎన్జీవోలు, విశ్రాంత ఉద్యోగులు సంపూర్ణ మద్దతు తెలిపారని ప్యాఫ్టో జిల్లా ఛైర్మన్‌, సెక్రటరీ జనరల్‌ మరో ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు, ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలనాయుడు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కూడా కలెక్టరేట్‌ ముట్టడికి మద్దతు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని