logo

మరైన్‌బాద్‌ చెస్‌ టోర్నీ విజేత లలిత్‌బాబు

చెక్‌ రిపబ్లిక్‌లోని మరైన్‌స్కే లజ్నేలో ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు జరిగిన ‘మరైన్‌బాద్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నీ-2022’లో తెలుగు తేజం, విజయవాడకు చెందిన గ్రాండ్‌మాస్టర్‌ ముసునూరి రోహిత్‌ లలిత్‌బాబు విజేతగా

Published : 23 Jan 2022 03:24 IST

సహచర క్రీడాకారులతో ఎంఆర్‌ లలిత్‌బాబు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: చెక్‌ రిపబ్లిక్‌లోని మరైన్‌స్కే లజ్నేలో ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు జరిగిన ‘మరైన్‌బాద్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నీ-2022’లో తెలుగు తేజం, విజయవాడకు చెందిన గ్రాండ్‌మాస్టర్‌ ముసునూరి రోహిత్‌ లలిత్‌బాబు విజేతగా నిలిచాడు. కొవిడ్‌ నేపథ్యంలో సుమారు రెండేళ్ల విరామం తర్వాత లలిత్‌బాబు తలపడిన మూడు టోర్నీల్లో ఛాంపియన్‌గా నిలిచి ‘హ్యాట్రిక్‌’ సాధించడం విశేషం. ప్రస్తుతం జరిగిన టోర్నీలో ముగ్గురు గ్రాండ్‌మాస్టర్లు, నలుగురు ఇంటర్నేషనల్‌ మాస్టర్లు, ఇద్దరు ఫిడే మాస్టర్లు తలపడ్డారు. లలిత్‌బాబు ఆడిన తొమ్మిది రౌండ్లలోనూ ఏ ఒక్క రౌండ్‌లో ఓటమిపాలవకుండా నాలుగు రౌండ్లు విజయాలు, అయిదు రౌండ్లు డ్రా చేసుకోవడం ద్వారా 6.5 పాయింట్లతో ఛాంపియన్‌గా నిలిచాడు. గత ఏడాది డిసెంబరు 15 నుంచి 23వ తేదీ వరకు జరిగిన థాయ్‌లాండ్‌ చెస్‌ ఓపెన్‌ టోర్నీ, ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకు 6వ వెర్గాని కప్‌ టోర్నీల్లోనూ అతను విజేతగా నిలిచాడు. వచ్చే నెల 5 నుంచి 15వ తేదీ వరకు బుడాపెస్ట్‌లో జరిగే మరో టోర్నీలో తలపడనున్నట్టు లలిత్‌బాబు తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని