logo

జిన్నా టవర్‌పై జాతీయ జెండాను ఎగురవేయాల్సిందే

గుంటూరులోని జిన్నా టవర్‌పై జాతీయ జెండాను ఎగురవేసి తీరాల్సిందేనని జాతీయ కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్‌ వల్లూరు జయప్రకాష్‌ నారాయణ అన్నారు. గుంటూరులో బుధవారం ఆయన

Published : 27 Jan 2022 05:15 IST

జాతీయ కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్‌ వల్లూరు

గుంటూరు(జిల్లాపరిషత్తు), న్యూస్‌టుడే: గుంటూరులోని జిన్నా టవర్‌పై జాతీయ జెండాను ఎగురవేసి తీరాల్సిందేనని జాతీయ కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్‌ వల్లూరు జయప్రకాష్‌ నారాయణ అన్నారు. గుంటూరులో బుధవారం ఆయన పత్రికలకు ఓ ప్రకటన విడుదల చేశారు. జిన్నా టవర్‌ పేరు మార్చి అబ్దుల్‌ కలాం, హమీద్‌ వంటి నేతల పేర్లు పెట్టాలని కోరారు. దేశ విభజనకు కారణమైన జిన్నా పేరు మీద ఉన్న టవర్‌ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. జిన్నా టవర్‌పై జాతీయ జెండాను ఎగురవేసే బాధ్యతను భాజపా తీసుకుంటుందన్నారు. జిన్నా టవర్‌ వద్దకు వెళ్లిన భాజపా నాయకులు, హిందూ వాహిని సభ్యులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. దేశ భద్రత కోసం అమరుడైన జిల్లాకు చెందిన జశ్వంత్‌రెడ్డి జవాన్‌కి శౌర్య చక్ర అవార్డును ఇచ్చి కేంద్ర ప్రభుత్వం గౌరవిస్తే.. రాష్ట్రంలో మాత్రం ఈ దేశానికి ద్రోహం చేసిన వ్యక్తులు, సంస్థలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని