logo

నిత్య సరఫరా.. నెరవేరేనా..!

మూడు, నాలుగు రోజులకు ఒకసారి వచ్చే నీటితో గుôతకల్లు పట్టణ వాసులు ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీరే మార్గం కనిపించటం లేదు. పట్టణానికి రోజూ తాగునీటిని అందించడానికి అవసరమైన నీటిని శుభ్రం చేసే ప్లాంటు పనులు రెండేళ్ల కిందట ఆగిపోయాయి.

Published : 15 Jan 2022 05:50 IST

రెండేళ్లుగా నిలిచిన నీటి శుద్ధి ప్లాంటు నిర్మాణం


ఆగిపోయిన నీటిని శుభ్రంచేసే ప్లాంటు నిర్మాణం

గుంతకల్లు, న్యూస్‌టుడే: మూడు, నాలుగు రోజులకు ఒకసారి వచ్చే నీటితో గుôతకల్లు పట్టణ వాసులు ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీరే మార్గం కనిపించటం లేదు. పట్టణానికి రోజూ తాగునీటిని అందించడానికి అవసరమైన నీటిని శుభ్రం చేసే ప్లాంటు పనులు రెండేళ్ల కిందట ఆగిపోయాయి. హంద్రీనీవా నీటిని కొత్త ఎస్‌ఎస్‌ట్యాంకులోకి పంపింగ్‌ చేయడానికి కాలువ పక్కన నిర్మిస్తున్న పంపింగ్‌ గదుల నిర్మాణం కూడా నిలిచిపోయింది. అమృత్‌ పథకం కింద ఈ పనులను చేయడానికి ప్రభుత్వం రూ.7 కోట్లను కేటాయించింది. ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని, కరోనా విజృంభిస్తోందని అంటూ గుత్తేదారు పనులను ఆపేశారు. చేసిన పనులు కూడా పాడైపోతున్నాయి.

పనుల్లో జాప్యంతో ఇక్కట్లు
గుంతకల్లు పట్టణ వాసులకు రోజూ నీటిని అందించాలంటే రోజుకు కనీసం నాలుగు మిలియన్‌ లీటర్లను సరఫరా చేయాల్సి ఉంది. దీని కోసం ఇప్పుడున్న రెండు నీటిని శుభ్రంచేసే ప్లాంట్లకు తోడుగా మరో ప్లాంటును నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. గుత్తేదారు నిర్వాకం కారణంగా రెండు సంవత్సరాల నుంచి పనులు జరగడంలేదు. పంపింగ్‌ గది నిర్మాణంలో జాప్యం జరుగుతుండడంతో కొత్త ట్యాంకుకు సకాలంలో నీటిని పూర్తిస్థాయిలో నింపలేకపోతున్నారు. పర్యవసానంగా గుంతకల్లు వాసులు నీటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ పనులు పూర్తయితే రోజూ పట్టణానికి నీటిని సరఫరా చేయడానికి వీలవుతుందని అధికారులు చెబుతున్నారు. గుత్తేదారు పట్టణంలో నిర్మించిన పైప్‌లైన్‌ పనులకు, ప్లాంటు నిర్మాణానికి ఇంతవరకు జరిగిన పనులకు రూ.7.49 కోట్లను చెల్లించారు. పనులను చేపట్టి వెంటనే పూర్తిచేయాలని గుత్తేదారులపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. పట్టణంలో రోజూ నీటిని అందించడానికి పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తిచేసి ఆదుకోవాలని గుంతకల్లు వాసులు కోరుతున్నారు.

త్వరగా పూర్తిచేయిస్తాం
- నీటిని శుభ్రంచేసే ప్లాంటు, పంపింగ్‌ గదుల నిర్మాణం పనులను గుత్తేదారు కరోనా పేరుతో ఆపివేశారు. ఉన్న యంత్రాలు, సామగ్రిని తరలించారు. ఆయనకు చెల్లించాల్సిన బిల్లులను చెల్లించాం. పనులను త్వరగా తిరిగి చేపట్టి, త్వరగా పూర్తిచేసి మున్సిపాలిటీకి స్వాధీనం చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నాం. ప్రసుత్తం నిధుల కొరత లేదు. పనులను సకాలంలో పూర్తిచేసి పట్టణ ప్రజలకు అవసరమైనంత నీటిని అందించే విధంగా కృషిచేస్తాం.
- వెంకటాచలపతి, తాగునీటి పర్యవేక్షక డీఈ


పూర్తికాని పంపింగ్‌ గది నిర్మాణం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని