logo

స్పందన ఫిర్యాదులపై అలసత్వం వద్దు

‘స్పందన’కు వచ్చే ఫిర్యాదులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో అలసత్వం ప్రదర్శించ వద్దని ఎస్పీ ఫక్కీరప్ప అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని

Published : 24 May 2022 06:00 IST

ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎస్పీ ఫక్కీరప్ప, అదనపు ఎస్పీ నాగేంద్రుడు

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: ‘స్పందన’కు వచ్చే ఫిర్యాదులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో అలసత్వం ప్రదర్శించ వద్దని ఎస్పీ ఫక్కీరప్ప అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల సమస్యను ఎస్పీ ఓపిగ్గా విని, అక్కడికక్కడే ఆయా స్టేషన్ల అధికారులతో చరవాణిలో మాట్లాడి, పరిష్కార మార్గం చూపాలని ఆదేశించారు. ‘స్పందన’కు మొత్తం 94 ఫిర్యాదులు అందాయి. అదనపు ఎస్పీ (అడ్మిన్‌) నాగేంద్రుడు ఫిర్యాదులు స్వీకరించారు. దేవా ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో స్పందనకు వచ్చిన వారికి అన్నదానం చేశారు.

మిస్సింగ్‌ కేసుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: 2012 నుంచి పెండెన్సీలో ఉన్న మిస్సింగ్‌ కేసులపై ఎస్పీ ఫక్కీరప్ప సోమవారం జిల్లాలోని సీఐలతో పోలీసు కాన్ఫరెన్సు హాలులో సమీక్ష చేశారు. గర్ల్‌, బాయ్‌, మెన్‌, ఉమెన్‌ ఇలా ఎలాంటి మిస్సింగ్‌ కేసులైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏ చిన్న అవకాశం దొరికినా వదలకుంగా పురోగతి సాధించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని