logo

నేత్రానందం.. నాట్యకళా ఉత్సవం

స్థానిక ఆర్డీటీ బధిరుల పాఠశాలలో గత రెండు రోజులుగా జరుగుతున్న జిల్లాస్థాయి సంగీత, నాట్యకళా ఉత్సవాలు బుధవారం ముగిశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ చిన్నారులు నృత్య పోటీల్లో పాల్గొని సందడి చేశారు. శివుడి పాటలకు అఘోరాల వేషధారణలో చిన్నారులు చే

Published : 30 Jun 2022 02:43 IST


చిన్నారుల అద్భుత నృత్య ప్రదర్శన

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: స్థానిక ఆర్డీటీ బధిరుల పాఠశాలలో గత రెండు రోజులుగా జరుగుతున్న జిల్లాస్థాయి సంగీత, నాట్యకళా ఉత్సవాలు బుధవారం ముగిశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ చిన్నారులు నృత్య పోటీల్లో పాల్గొని సందడి చేశారు. శివుడి పాటలకు అఘోరాల వేషధారణలో చిన్నారులు చేసిన నృత్యాలు చూపరులను కట్టిపడేశాయి. నరసింహస్వామి భక్తి పాటలకు బాలికలు చేసిన నృత్యం ఆకట్టుకుంది. అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి వచ్చిన దాదాపు 300 మందికిపైగా చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ప్రత్యేక డ్యాన్స్‌ మాస్టర్లు విజేతలను నిర్ణయించారు. విజేతలకు ఆర్డీటీ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అన్నేఫెర్రర్‌ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులు గత రెండు రోజులుగా సంగీత, నాట్యకళా ప్రదర్శనలు అద్భుతంగా ఇచ్చారన్నారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడానికే ఈ పోటీలు నిర్వహించామన్నారు. గెలుపొందిన విద్యార్థులు మరిన్ని అవకాశాలు పొందేలా సంస్థ కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో సంస్థ మహిళా సాధికారత డైరెక్టర్‌ విశాల ఫెర్రర్‌, ప్రతినిధులు మోహన్‌మురళీ, రపీఫక్‌, నారాయణరెడ్డి, మంజునాథ, ఎర్రస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని