logo

ఆర్టీవో చెక్‌పోస్టుపై అనిశా సోదాలు

ఆర్టీవో చెక్‌పోస్టుపై మంగళవారం రాత్రి అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు సోదాలు నిర్వహించి అనధికారికంగా ఉన్న రూ.85,670 నగదు స్వాధీనం చేసుకొన్నారు. అనిశా సీఐ ప్రభాకర్‌ కథనం ప్రకారం... ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు,

Published : 07 Jul 2022 03:17 IST

అక్రమంగా నిల్వఉన్న రూ.85,670 స్వాధీనం

పెనుకొండ పట్టణం, న్యూస్‌టుడే: ఆర్టీవో చెక్‌పోస్టుపై మంగళవారం రాత్రి అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు సోదాలు నిర్వహించి అనధికారికంగా ఉన్న రూ.85,670 నగదు స్వాధీనం చేసుకొన్నారు. అనిశా సీఐ ప్రభాకర్‌ కథనం ప్రకారం... ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెనుకొండ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఉన్న ఆర్టీవో చెక్‌పోస్టులో సోదాలు నిర్వహించారు మంగళవారం అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగాయి. సోదాల్లో చెక్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్న ఎంవీఐ శ్రీకాంత్‌, ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు వేణుగోపాల్‌, మూర్తి ద్వారా వాహనదారుల నుంచి అక్రమంగా నగదు వసూళ్లు చేస్తున్నట్లు గుర్తించాం. సోదాల్లో పట్టుకున్న నగదు, రికార్డులు స్వాధీనం చేసుకొన్నారు. కేసునమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని సీఐ చెప్పారు. అధికారులు ఎవరైనా లంచం అడిగితే 14400 కాల్‌ సెంటర్‌కి గాని, 14400 అప్లికేషన్‌ ద్వారా తెలియజేయాలని కోరారు. ఈ సోదాల్లో అనిశా ఇన్‌స్పెక్టర్లు మోహన్‌ ప్రసాద్‌, హేమంత్‌కుమార్‌రెడ్డి, శంకరరెడ్డి, శాంతిలాల్‌, శివగంగాధర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని