logo

అశ్వవాహనంపై ఊరేగిన ఖాద్రీశుడు

దసరా శరన్నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామికి ఉత్సవాల్లో చివరి రోజున శమీవృక్ష పూజలు నిర్వహించారు. 

Published : 07 Oct 2022 04:42 IST

అశ్వవాహనాన్ని లాగుతున్న భక్తులు

కదిరి, న్యూస్‌టుడే: దసరా శరన్నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామికి ఉత్సవాల్లో చివరి రోజున శమీవృక్ష పూజలు నిర్వహించారు.  ఉదయం పల్లకీపై ఊరేగుతూ  శమీమండపానికి చేరుకున్నారు. అక్కడ ఆలయ అర్చకులు శమీవృక్షం, ఆయుధ పూజలు చేశారు. అనంతరం శమీమండపంలో శ్రీవారిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత అశ్వవాహనంపై నారసింహుని ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి పురవీధుల్లో గ్రామోత్సవంతో భక్తులకు దర్శనమిచ్చారు. సుందరరూపుడైన ఖాద్రీశుని దర్శనం పొందిన పురప్రజలు ఆనందపరవశులయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని