logo

సెలవుపై వెళ్లినా.. జీతాలెలా ఇచ్చారు?

‘ప్రజల కోసం ప్రశ్నిస్తే.. నాపై కేసులు పెడతారా.. కృష్ణ అనే అటెండర్‌ ఎక్కడ విధులు నిర్వహించాలి? ఎక్కడ పనిచేస్తున్నాడు?’ అని నాలుగో వార్డు కౌన్సిలర్‌ జేసీపీ రమణ ప్రశ్నించారు.

Published : 01 Dec 2022 05:47 IST

కౌన్సిలర్‌, కమిషనర్‌ మాటల యుద్ధం

కమిషనర్‌ను ప్రశ్నిస్తున్న కౌన్సిలర్‌ రమణ

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: ‘ప్రజల కోసం ప్రశ్నిస్తే.. నాపై కేసులు పెడతారా.. కృష్ణ అనే అటెండర్‌ ఎక్కడ విధులు నిర్వహించాలి? ఎక్కడ పనిచేస్తున్నాడు?’ అని నాలుగో వార్డు కౌన్సిలర్‌ జేసీపీ రమణ ప్రశ్నించారు. ఆదివారం వెళ్లి శాంతినగర్‌లో ఇంటి నిర్మాణం చేస్తున్న లబ్ధిదారులకు నోటీసులు ఇవ్వడమేంటని కమిషనర్‌ను నిలదీశారు. బుధవారం కౌన్సిల్‌ సమావేశం ఛైర్‌పర్సన్‌ నిర్మల అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్‌ రమణ, కమిషనర్‌ మల్లికార్జున మధ్య మాటల యుద్ధం నడిచింది. కమిషనర్‌ సమాధానం ఇస్తూ ఆదివారం పనిచేయకూడదని ఎక్కడా లేదని, వద్దని చెబితే సిబ్బంది ఎవరూ పనిచేయకుండా చూస్తామన్నారు. 35వ వార్డు అడ్మిన్‌ తేజశ్విని మూడు నెలలు కిందట సెలవుపై వెళ్లారు. కానీ, ఆమెకు ప్రతినెలా జీతం ఎలా చెల్లించారని కౌన్సిలర్‌ ప్రశ్నించారు. 345 మంది వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారని, క్లర్కు పొరపాటు వల్ల తప్పిదం జరిగిందని, జీతాన్ని తిరిగి ట్రెజరీకు చెల్లించాలని ఆదేశించామని కమిషనర్‌ వివరించారు. మళ్లీ ఇలాంటి ప్రశ్నలే సంధించడంతో కమిషనర్‌ ఆవేదనతో స్పందించారు. తాను ఏ తప్పూ చేయలేదని, తప్పు చేస్తే తలవంచుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. తాను నోరుమెదిపితే కౌన్సిల్‌లో ఉన్నవారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కానీ, నా నైతిక విలువలను దిగజార్చుకొని మాట్లాడనని సమాధానమిచ్చారు. ఇతర కౌన్సిలర్లు కల్పించుకొని సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగింది. 35 అంశాలతో కూడిన అజెండాను చదివి వినిపించారు. వివిధ సమస్యలపై చర్చించారు. సమావేశంలో వైస్‌ ఛైర్మన్‌ భాగ్యలక్ష్మి, ఈఈ సత్యనారాయణ, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని