logo

వేతనాలివ్వకపోతే కుటుంబాలనెలా పోషించాలి?

నెలనెలా జీతాలు ఇవ్వకపోతే కార్మికులు కుటుంబాలనెలా పోషించుకోవాలని సత్యసాయి తాగునీటి పథకం కార్మికుల యూనియన్‌ జిల్లా కార్యదర్శి మధుసూదన్‌ ప్రశ్నించారు.

Published : 05 Feb 2023 04:29 IST

నిరసన తెలుపుతున్న కార్మికులు

పుట్టపర్తి, న్యూస్‌టుడే: నెలనెలా జీతాలు ఇవ్వకపోతే కార్మికులు కుటుంబాలనెలా పోషించుకోవాలని సత్యసాయి తాగునీటి పథకం కార్మికుల యూనియన్‌ జిల్లా కార్యదర్శి మధుసూదన్‌ ప్రశ్నించారు. శనివారం పుట్టపర్తి సత్యసాయి తాగునీటి పథకం వద్ద కార్మికులు నిరసన తెలిపారు. సత్యసాయి తాగునీటి పథకం నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే చేపట్టాలని, వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రతినెలా కార్మికులకు వేతనాలు అందించేదని, సంస్థ 2021 జూన్‌ నుంచి నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకుందని, అప్పటి నుంచి ముగ్గురు గుత్తేదారులు తప్పుకున్నారని, నిర్వహణ గాడి తప్పిందని వాపోయారు. పెండింగ్‌లోని నాలుగు నెలలు వేతనాలు, పీఎఫ్‌, తొమ్మిది నెలల ఈఎస్‌ఐ బకాయిలు వెంటనే జమ చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా కోశాధికారి రాము, సభ్యులు శ్రీనివాసులు, చంద్రశేఖర్‌, చందు, నాగరాజు, ఓబిలేసు, బాబాసాహెబ్‌, తిమ్మారెడ్డి, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని