logo

చట్టం చేస్తేనే ఒకటో తేదీన వేతనం

ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనం అందాలంటే కచ్చితంగా చట్టం చేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోపీకృష్ణ పేర్కొన్నారు.

Published : 07 Feb 2023 04:42 IST

మాట్లాడుతున్న ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోపీకృష్ణ

అనంత సంక్షేమం, న్యూస్‌టుడే: ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనం అందాలంటే కచ్చితంగా చట్టం చేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోపీకృష్ణ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం అనంత నగరంలో సదరు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చర్చావేదిక నిర్వహించారు. చట్టపరంగా ఉద్యోగుల బకాయిలు చెల్లించాలన్నారు. రావాల్సిన బకాయిలను నిర్ధిష్టమైన సమయాల్లో ఇవ్వాలని డిమాండు చేశారు. ఉద్యోగుల కష్టాలు, కన్నీళ్లు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశానికి హాజరైనవారు ఏకరువు పెట్టారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి రాము నాయక్‌, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ రమణ కుమార్‌, ఉపాధ్యక్షురాలు సాంబశివమ్మ, వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని