logo

‘అనతి కాలంలోనే అంతర్జాతీయ స్థాయికి’

జిల్లాలో ఎక్కడో ఒక మూలన ఉన్న సాఫ్ట్‌బాల్‌ క్రీడను అంతర్జాతీయ స్థాయికి చేర్చడం గర్వంగా ఉందని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంచోఫెర్రర్‌ పేర్కొన్నారు. జాతీయ క్రీడాపటంలో ఎక్కడో ఉన్న మన రాష్ట్ర స్థానం అగ్రస్థానికి చేరడానికి ఎంతోమంది కృషి దాగి ఉందని ఆయన వెల్లడించారు.

Published : 07 Jun 2023 05:16 IST

జాతీయ మినీ సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలు ప్రారంభం

మాట్లాడుతున్న ఆర్డీటీ పీడీ మాంచో ఫెర్రర్‌

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: జిల్లాలో ఎక్కడో ఒక మూలన ఉన్న సాఫ్ట్‌బాల్‌ క్రీడను అంతర్జాతీయ స్థాయికి చేర్చడం గర్వంగా ఉందని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంచోఫెర్రర్‌ పేర్కొన్నారు. జాతీయ క్రీడాపటంలో ఎక్కడో ఉన్న మన రాష్ట్ర స్థానం అగ్రస్థానికి చేరడానికి ఎంతోమంది కృషి దాగి ఉందని ఆయన వెల్లడించారు. మంగళవారం సాయంత్రం అనంత క్రీడా గ్రామంలో జరిగిన మినీ సబ్‌జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సాఫ్ట్‌బాల్‌ క్రీడను 13 ఏళ్ల క్రితం ఆర్డీటీ దత్తత తీసుకుందని నాటికి నేటికి అభివృద్ధి ఊహించని విధంగా జరిగిందన్నారు. ఎంతోమంది మారుమూల గ్రామాల నుంచి వచ్చిన క్రీడాకారులు అంతర్జాతీయ గడప తొక్కడం వెనుక ఆర్డీటీ ప్రోత్సాహం ఉందన్నారు. సాఫ్ట్‌బాల్‌ క్రీడకు వందశాతం సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సాఫ్ట్‌బాల్‌ సంఘం జాతీయ సీఈఓ ప్రవీణ్‌ అనౌకర్‌ మాట్లాడుతూ.. ఈ క్రీడలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ముందు వరుసలో నిలవడానికి ఆర్డీటీ అందిస్తున్న సహకారం మరువలేమన్నారు. సాఫ్ట్‌బాల్‌ సంఘం జాతీయ కోశాధికారి శ్రీకాంత్‌ తోరట్‌, ఆర్డీటీ ఛైర్మన్‌ తిప్పేస్వామి, డీఎస్‌ఏ ముఖ్య శిక్షకుడు జగన్నాథరెడ్డి, సంఘం రాష్ట్ర సీఈఓ సి.వెంకటేశులు, కార్యదర్శి నాగేంద్ర, పీటీఈల సంఘం జిల్లా నాయకుడు నరసింహారెడ్డి, పీడీలు కేశవమూర్తి, లతాదేవి, చంద్రశేఖర్‌, గౌసియా పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని