logo

పుంజుకున్న నామినేషన్లు

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ పుంజుకుంది.

Published : 20 Apr 2024 03:43 IST

అసెంబ్లీలకు 13, పార్లమెంటుకు ఒకటి

తాడిపత్రిలో ఆర్వో రాంభూపాల్‌రెడ్డికి నామపత్రాలు అందజేస్తున్న  తెదేపా అభ్యర్థి అస్మిత్‌రెడ్డి

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ పుంజుకుంది. తొలి రోజుతో పోల్చితే రెండో రోజైన శుక్రవారం నామినేషన్ల సంఖ్య పెరిగింది. అనంత లోక్‌సభ స్థానానికి ఒకటి, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు 13 నామినేషన్లు వేశారు. ఈ రెండు రోజుల సంఖ్యను కలిపితే... లోక్‌సభకు మూడు, అసెంబ్లీ స్థానాలకు 22 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. శుక్రవారం నామినేషన్‌ వేసిన వారిలో.. అనంత లోక్‌సభకు స్వతంత్ర అభ్యర్థిగా తాడిపత్రి పట్టణానికి చెందిన పామిశెట్టి చౌడేశ్వరి నామినేషన్‌ వేయగా, అసెంబ్లీ స్థానాల వారీగా.. ఉరవకొండ కాంగ్రెస్‌ అభ్యర్థిగా వై.మధుసూదన్‌రెడ్డి, రాప్తాడుకు వైకాపా అభ్యర్థిగా తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి , కాంగ్రెస్‌ అభ్యర్థిగా శంకరయ్య, అఖిల భారత కిసాన్‌ జనతా పార్టీ అభ్యర్థిగా మల్లికార్జున, కళ్యాణదుర్గం తెదేపా అభ్యర్థిగా అమిలినేని సురేంద్రబాబు, వైకాపా తరఫున తలారి రంగయ్య, అనంత అర్బన్‌ స్వతంత్ర అభ్యర్థిగా శ్రీరంగనాథ్‌ గోపీనాథ్‌, గుంతకల్లు వైకాపా అభ్యర్థిగా వై.వెంకట్రామిరెడ్డి, శింగనమల తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ అభ్యర్థిగా యాటవెంకట సుబ్బన్న, అఖిల భారత కిసాన్‌ జనతాపార్టీ తరఫున కప్పల నాగరాజు, రాయదుర్గం బీఎస్పీ అభ్యర్థిగా సి.నాగరాజు, తాడిపత్రి తెదేపా అభ్యర్థిగా జేసీ అస్మిత్‌రెడ్డి, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి తరఫున నల్లా రమేశ్‌ నాయుడు నామినేషన్లు వేశారు.

నామపత్రాలను ఆర్‌వో రాణిసుస్మితకు అందజేస్తున్న కళ్యాణదుర్గం తెదేపా  ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు సోదరి రాధామాధవి, రామ్మోహన్‌చౌదరి తదితరులు


అభ్యర్థుల ఆస్తిపాస్తులు

నామినేషన్‌ మొదలైన రెండో రోజు శుక్రవారం పలు పార్టీ అభ్యర్థులు వారి ఆస్తిపాస్తులు, విద్యార్హత, కేసుల వివరాలను నామపత్రాల్లో దాఖలు పర్చారు. ఆ వివరాలు సంక్షిప్తంగా ఇలా..

న్యూస్‌టుడే, బృందం


అభ్యర్థి : చిన్నారెడ్డి గారి అస్మిత్‌రెడ్డి

పార్టీ  : తెదేపా
నియోజకవర్గం: తాడిపత్రి
విద్యార్హత : ఎంబీఏ, స్కాట్‌లాండ్‌
కేసులు:  30
చరాస్తులు : రూ. 27.75కోట్లు
స్థిరాస్తులు : రూ.147 కోట్లు
అప్పులు: 26.87 కోట్లు
బంగారం: 604 గ్రాములు, వజ్రాలు పొదిగిన బంగారం : 525 గ్రాములు


అభ్యర్థి పేరు: అమిలినేని సురేంద్రబాబు

పార్టీ: తెదేపా
నియోజకవర్గం: కళ్యాణదుర్గం
విద్యార్హత: పదో తరగతి(ఎస్‌ఎస్‌సీ)
కేసులు: రెండు (ఎస్సీ, ఎస్టీ అల్రాసిటీ)
చరాస్తులు: రూ.10.93కోట్లు
బంగారం: 2,907గ్రాములు
స్థిరాస్తులు: రూ.165.68కోట్లు
అప్పులు: రూ.39.68కోట్లు


అభ్యర్థి: తలారి రంగయ్య, పార్టీ: వైకాపా

విద్యార్హత: ఎంఏ, ఎంఎల్‌ఐఎస్‌ఈ, పీహెచ్‌డీ, కేసులు: లేవు
చరాస్తులు: రూ.68.27లక్షలు
బంగారం: లేదు
స్థిరాస్తులు: రూ.3.83కోట్లు
అప్పులు: రూ.1.30కోట్లు


అభ్యర్థి : వై. వెంకటరామిరెడ్డి

పార్టీ : వైకాపా
నియోజకవర్గం : గుంతకల్లు
విద్యార్హత : బీకాం.
కేసులు : 4  
చరాస్తుల విలువ : రూ. 2.20 కోట్లు
బంగారం : 1350 గ్రాములు
స్థిరాస్తి విలువ : రూ. 2.28 కోట్లు
అప్పులు : రూ. 97.61 లక్షలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని