logo

పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోండి

ఎన్నికల విధులకు నియామకం పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించు కోవాలని కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు.

Updated : 24 Apr 2024 06:21 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, నగర కమిషనర్‌ స్వరూప్‌, డీపీఓ ప్రభాకర్‌రావు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ఎన్నికల విధులకు నియామకం పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించు కోవాలని కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం రెవెన్యూ భవన్‌లో ఈవీఎం నోడల్‌ అధికారి/అనంత నగర కమిషనర్‌ మేఘాస్వరూప్‌, డీపీఓ/నోడల్‌ అధికారి ప్రభాకర్‌రావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల విధులకు అన్ని కేడర్ల సిబ్బంది 23,900 మందిని నియమించినట్లు, ఇందులో ఇప్పటిదాకా ఫాం-12 11,470 మంది మాత్రమే ఇచ్చారని, ఈ జిల్లాలో పని చేస్తున్న ఇతర జిల్లాల నివాసితులు 888 మంది ఉన్నారని వివరించారు. ఇతర జిల్లాలవారు అయితే ఈనెల 26లోపు, జిల్లాకు సంబంధించిన వారైతే ఈ నెల 28 దాకా ఫాం-12 ఇవ్వవచ్చన్నారు. పనిచేసే ప్రాంతాల్లోని ఆర్వోలకే ఫాం-12 ఇవ్వాలని సూచించారు.  జిల్లాలోని 85పైన వయసు కలిగిన వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం హోం ఓటింగ్‌ సదుపాయాన్ని కల్పించామని, జిల్లాలో వయోవృద్ధులు 9828 మంది ఉంటే.. 611 మంది ఇంటి వద్దే ఓటు వేస్తామని ఫాం-12డీ ఇచ్చారు. ఇదే తరహాలోనే దివ్యాంగులు 26,097 మంది ఉంటే 693 మంది ఐచ్ఛికం ఇచ్చారన్నారు. ఈనెల 16 నుంచి 23 దాకా ఫాం-12డీ తీసుకున్నామని చెప్పారు. వీరందరికీ మే 5 నుంచి 9 దాకా హోం ఓటింగ్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని