logo

రానున్న మూడ్రోజుల్లో తీవ్ర వడగాలులు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న మూడు రోజుల్లో తీవ్రమైన వడ గాలులు వీస్తాయని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.

Published : 01 May 2024 03:51 IST

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే : ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న మూడు రోజుల్లో తీవ్రమైన వడ గాలులు వీస్తాయని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. మే 1, 2, 3వ తేదీల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. పంట పొలాల్లో పనిచేసే రైతులు ఉదయం 10 గంటల తర్వాత విశ్రాంతి తీసుకోవాలన్నారు. ఎండలో పని చేస్తే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. చిన్నారులు, వృద్ధులు ఇళ్లలోనే ఉండటం మంచిదన్నారు. పశువులు, గొర్రెలను కూడా ఉదయం, సాయంత్రం వేళల్లో మేతకు తీసుకెళ్లాలని సూచించారు. వీలైనంత ఎక్కువగా నీరు అందించాలని శాస్త్రవేత్తలు తెలిపారు.

శింగనమలలో గరిష్ఠ ఉష్ణోగ్రత 45.3 డిగ్రీలు

గతంలో ఎన్నడూ లేని విధంగా శింగనమల మండలంలో రికార్డు స్థాయిలో 45.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. ఈ ఏడాదిలో ఇదే అత్యధికమన్నారు. తాడిపత్రిలో 45.0, కదిరి 44.9, తలుపుల 44.6, కూడేరు, గుంతకల్లు, యల్లనూరులో 44.5, పుట్లూరు 44.3, చెన్నేకొత్తపల్లి 44.2, యాడికి 44.0, ధర్మవరం 4.8, పరిగి, కనగానపల్లి 43.7, బుక్కరాయసముద్రం 43.6, పెద్దవడుగూరు, గుమ్మఘట్ట 43.4, ఉరవకొండ 43.3, రామగిరి, బొమ్మనహాళ్‌ 43.2, ముదిగుబ్బ, నంబులపూలకుంట, అమరాపురం 43.1, కొత్తచెరువు 43.0 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మరో మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని