logo

అరాచక పాలనకు అంతం పలుకుదాం

అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న వైకాపాకు అంతం పలుకుదామని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. ఆత్మకూరు మండలం పలు గ్రామాల్లో మంగళవారం పరిటాల సునీత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

Published : 01 May 2024 04:03 IST

డి.కె. తండాలో మాట్లాడుతున్న సునీత

అనంతపురం(వ్యవసాయం), ఆత్మకూరు, న్యూస్‌టుడే: అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న వైకాపాకు అంతం పలుకుదామని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. ఆత్మకూరు మండలం పలు గ్రామాల్లో మంగళవారం పరిటాల సునీత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మండలంలోని ముట్టాల, గొరిదిండ్ల, డి.కె తండా, పి.సిద్దరాంపురం, పి.యాలేరు, పంపనూరు, పంపనూరు తండా, వడ్డుపల్లి, తలుపూరు గ్రామాల్లో రోడ్డుషో, ఇంటింటా తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ తాము అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గం వ్యాప్తంగా రూ.5 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. నేడు వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అందులో 10 శాతమైనా చేశారా అని సవాల్‌ విసిరారు. 2019లో తెదేపా అధికారంలోకి వచ్చి ఉంటే మండలంలోని అన్ని గ్రామాలు సస్యశ్యామలం అయ్యేవని.. అందుకు ప్రజలు నేడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 25 హామీలను వెంటనే నెరవేరుస్తామని తెలిపారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి సునామీతో వైకాపా కొట్టుకుపోయేది ఖాయమని సునీత, ధర్మవరం తెదేపా ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ పేర్కొన్నారు. అనంతపురం క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు మండలం తలుపూరు గ్రామానికి చెందిన 10 కుటుంబాలు, కనగానపల్లి మండలం బద్దలాపురం, చెన్నేకొత్తపల్లి మండలం ప్రసన్నాయపేట, ఆమిదాలకుంట, కొండకిందపల్లి గ్రామాలకు చెందిన 15 కుటుంబాలు, అనంతపురం గ్రామీణం కామారుపల్లి చెందిన వైకాపా నాయకులు తెదేపాలోకి చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని