logo

‘ముస్లింల నమ్మకద్రోహి జగన్‌’

రాష్ట్రంలో ముస్లిం, మైనారిటీలకు నమ్మించి మోసం చేసిన ఘనత జగన్‌దేనని శాసనమండలి మాజీ ఛైర్మన్‌, తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు షరీఫ్‌ ఆరోపించారు. బుధవారం నగరం అనంత కన్వెన్షన్‌ హాలులో ముస్లిం, మైనారిటీలకు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

Published : 02 May 2024 03:37 IST

ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న మాజీ శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌, ఇరువైపుల దగ్గుపాటి ప్రసాద్‌, అంబికా లక్ష్మీనారాయణ

అనంతపురం(కళ్యాణదుర్గంరోడ్డు), న్యూస్‌టుడే: రాష్ట్రంలో ముస్లిం, మైనారిటీలకు నమ్మించి మోసం చేసిన ఘనత జగన్‌దేనని శాసనమండలి మాజీ ఛైర్మన్‌, తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు షరీఫ్‌ ఆరోపించారు. బుధవారం నగరం అనంత కన్వెన్షన్‌ హాలులో ముస్లిం, మైనారిటీలకు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా తెదేపా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌, తెదేపా అభ్యర్థులు దగ్గుపాటి ప్రసాద్‌, అంబికా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. షరీఫ్‌ మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ముస్లిం మైనారిటీలకు అదనంగా వచ్చిన ప్రయోజనం లేకపోగా వారికి అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ ఎత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాకు బుద్ధి చెప్పాలని ఆయన హెచ్చరించారు. అభ్యర్థులు, దగ్గుపాటి ప్రసాద్‌, అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ముస్లిం మైనారిటీలకు ఇంటి స్థలాల కోసం 20 ఎకరాలు భూమిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌస్‌మోహిద్దీన్‌, మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ నూర్‌ మహమ్మద్‌, మైనారిటీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సాలార్‌బాషా, చమన్‌ తనయుడు డాక్టర్‌ ఉమర్‌, మత పెద్దలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని