logo

వైకాపా అరాచక పాలనను సాగనంపుదాం

అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపుదామని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి పిలుపునిచ్చారు.

Published : 02 May 2024 03:42 IST

మాట్లాడుతున్న అమిలినేని సురేంద్రబాబు, పక్కన బీకే పార్థసారథి

బ్రహ్మసముద్రం, న్యూస్‌టుడే: అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపుదామని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి పిలుపునిచ్చారు. బుధవారం బ్రహ్మసముద్రం మండలంలోని గుండిగానిపల్లి, పోలేపల్లి, భైరవానితిప్ప, కపటలింగనపల్లి, శరణప్పమఠం, పొబ్బర్లపల్లి, గొల్లలదొడ్డి, పడమటి కోడిపల్లి, ఎరడికెర, మామడూరు, పాలవెంకటాపురం గ్రామాల్లో వారు రోడ్‌షో నిర్వహించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సురేంద్రబాబుకు గజమాలలు వేసి, పూలు చల్లుతూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో బీటీ ప్రాజెక్టుకు, నియోజకవర్గంలోని 114 చెరువులకు కృష్ణాజలాలు తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడం తమ ధ్యేయమన్నారు. బీకే పార్థసారథి మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలపై అక్రమ కేసులు బనాయించి అనేక ఇబ్బందులకు గురిచేశారన్నారు. తెదేపాలో అన్ని వర్గాలకు సముచిత స్థానం ఉంటుందన్నారు. ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మామడూరు గ్రామంలో వైకాపాని వీడి 15 కుటుంబాలు సురేంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. కార్యక్రమంలో నాయకులు రాజగోపాల్‌, సురేంద్ర, రామ్మోహన్‌, కురుగౌడ్‌, బసవరాజు, చన్నమల్ల, శంకర్‌గౌడ్‌, నీలాస్వామి, జితేంద్రగౌడ్‌, ఓబుళేసు, రామకృష్ణ, షఫీ, శివయాదవ్‌, రామచంద్ర పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు