logo

వీఆర్‌కు కానిస్టేబుల్‌

కళ్యాణదుర్గంలో పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రం వద్ద ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి డబ్బులు పంచిన కానిస్టేబుల్‌ శివను పోలీసు అధికారులు వీఆర్‌కు పంపారు.

Published : 08 May 2024 05:34 IST

పోలీసుల అదుపులో రాళ్లు రువ్విన వైకాపా కార్యకర్త

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: కళ్యాణదుర్గంలో పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రం వద్ద ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి డబ్బులు పంచిన కానిస్టేబుల్‌ శివను పోలీసు అధికారులు వీఆర్‌కు పంపారు. బొమ్మనహాళ్‌ పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న శివ సోమవారం పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రం వద్ద ఓటరు జాబితాతో తిష్ఠ వేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిన విషయం తెలిసిందే. అతణ్ని అడ్డుకున్న తెదేపా శ్రేణులపై వైకాపా మూకలు ఘర్షణకు దిగాయి. అంతటితో ఆగక రాళ్లు రువ్వారు. దీనిపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు కానిస్టేబుల్‌ను వీఆర్‌కు పంపారు. ఇక నారాయణపురం గ్రామానికి చెందిన ఓంప్రకాశ్‌ అనే వైకాపా కార్యకర్త రాళ్లు రువ్వడంతో పోలీసులు అతణ్ని అదుపులో తీసుకొని కేసు నమోదు చేశారు.

కౌన్సిలర్‌ కుమారుడిపై కేసు

కళ్యాణదుర్గం గ్రామీణం: కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 19 వార్డు కౌన్సిలర్‌ కుమారుడు మారుతిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ హరినాథ్‌బాబు తెలిపారు. సోమవారం ఆ వార్డు పరిధిలోని మాజీ వాలంటీరు నళినితోపాటు ఆమె తల్లి, చెల్లిని దూషిస్తూ దాడి చేశాడన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని