logo

అనంతపురం అర్బన్‌ డీఎస్పీ బాధ్యతల స్వీకరణ

అనంతపురం అర్బన్‌ నూతన డీఎస్పీగా టీవీవీ ప్రతాప్‌కుమార్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న వీరరాఘవరెడ్డి ఎన్నికల కమిషన్‌ బదిలీ వేటు వేసిన విషయం విధితమే.

Published : 08 May 2024 05:36 IST

నూతన డీఎస్పీ టీవీవీ ప్రతాప్‌కుమార్‌

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: అనంతపురం అర్బన్‌ నూతన డీఎస్పీగా టీవీవీ ప్రతాప్‌కుమార్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న వీరరాఘవరెడ్డి ఎన్నికల కమిషన్‌ బదిలీ వేటు వేసిన విషయం విధితమే. అతని స్థానంలో గుంటూరు ఏసీబీలో పనిచేస్తున్న ప్రతాప్‌కుమార్‌ను ఎన్నికల కమిషన్‌ నియమించింది.  బాధ్యతలు స్వీకరించిన తర్వాత డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వేసేందుకు తగిన పరిస్థితులు కల్పిస్తామన్నారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు చేపడతామన్నారు. నగరంలోని సీఐలు, పలువురు ఎస్సైలు డీఎస్పీని కలిసి పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని