logo

వెళ్లి రావమ్మా గంగమ్మా..!

సకల లోకాలను ఏలే సర్వమంగళి గంగమ్మ తల్లి నిమజ్జన వేడుకల సందర్భంగా బుధవారం రాత్రి చిత్తూరు నగర వీధులు జనసంద్రాన్ని తలపించాయి.

Published : 23 May 2024 02:14 IST

ముగిసిన చిత్తూరు నడవీధి గంగమ్మ జాతర
ప్రత్యేక ఆకర్షణగా ఓంశక్తి భక్తుల విన్యాసాలు

విద్యుదీపాల వెలుగులో నడివీధి గంగమ్మ

చిత్తూరు(క్రీడలు), న్యూస్‌టుడే: సకల లోకాలను ఏలే సర్వమంగళి గంగమ్మ తల్లి నిమజ్జన వేడుకల సందర్భంగా బుధవారం రాత్రి చిత్తూరు నగర వీధులు జనసంద్రాన్ని తలపించాయి. డప్పు వాయిద్యాల దరువులకు చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర సంబరాలు అంగరంగ వైభవంగా సాగాయి. జాతర వంశపారంపర్య ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే సీకేబాబు కుటుంబంతో కలిసి.. స్థానిక పొన్నియమ్మన్‌ ఆలయం నుంచి ఊరేగింపుగా బయల్దేరి వెళ్లి గంగమ్మకు సారె సమర్పించారు. అనంతరం అమ్మవారు నిమజ్జనానికి బయల్దేరారు. దారి పొడవునా అమ్మవారిపై భక్తులు పెద్దఎత్తున పూలవర్షాన్ని కురిపించారు. నిమజ్జనోత్సవంలో భాగంగా ఓంశక్తి భక్తుల సాహసోపేత విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు నోటికి శూలాలు గుచ్చుకుని, వీపు, కాలికి ఇనుప కొక్కీలు బిగించి వాహనాలు లాగుతూ వచ్చి హైరోడ్‌ వద్ద అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

హై రోడ్‌లో గంగమ్మకు పూలమాల వేస్తున్న ఓంశక్తి భక్తుడు

గంగమ్మకు సారెను తీసుకెళ్తున్న ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే సీకేబాబు కుటుంబ సభ్యులు

చెంపపై శూలం గుచ్చుకుని

తలపై అమ్మవారి విగ్రహంతో ..

కిక్కిరిసిన నగరవీధులు

డప్పు కళాకారుల ప్రదర్శన

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు