logo

నిబంధన మీరి.. దూసుకొచ్చి..

నామినేషన్‌ దాఖలు సమయంలో ఆర్వో కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు నిలిచిపోవాలన్న నిబంధనను పుంగనూరులో వైకాపా శ్రేణులు అతిక్రమించాయి

Published : 20 Apr 2024 03:31 IST

పుంగనూరులో వైకాపా శ్రేణుల అత్యుత్సాహం

 

పుంగనూరు, న్యూస్‌టుడే: నామినేషన్‌ దాఖలు సమయంలో ఆర్వో కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు నిలిచిపోవాలన్న నిబంధనను పుంగనూరులో వైకాపా శ్రేణులు అతిక్రమించాయి. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయడానికి రాగా.. వైకాపా శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించాయి. ఈ సందర్భంగా పెద్దిరెడ్డితో పాటు ఆర్వో కార్యాలయంలోకి ప్రవేశించడానికి వైకాపా శ్రేణులు దూసుకొచ్చాయి. కార్యాలయంలోనికి నలుగురికే అనుమతి ఉండటంతో వారిని పోలీసులు ప్రధాన ద్వారం వద్ద అడ్డుకున్నారు. నిబంధన ప్రకారం వంద మీటర్ల దూరంలోనే వారిని నిలిపేయాల్సి ఉండగా.. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారు. కార్యక్రమంలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి పాల్గొన్నారు.


నియోజకవర్గం: పూతలపట్టు
అభ్యర్థి: కె.మురళీమోహన్‌
పార్టీ : తెదేపా విద్యార్హతలు: పీహెచ్‌డీ
స్థిరచరాస్తుల విలువ: రూ.75,80,320
భార్య పేరిట ఆస్తులు: రూ.60,88,297
అప్పులు: లేవు కేసులు: 11


నియోజకవర్గం: పూతలపట్టు
అభ్యర్థి: సునీల్‌కుమార్‌ పార్టీ: వైకాపా,
విద్యార్హతలు: ఎంబీబీఎస్‌, డీఎల్‌వో
స్థిరచరాస్తుల విలువ: రూ.1.84 కోట్లు
భార్య పేరిట: రూ.3.89కోట్లు
అప్పులు: రూ.2.15 కోట్లు. కేసులు: లేవు


నియోజకవర్గం : చిత్తూరు లోక్‌సభ
అభ్యర్థి: ఎన్‌.రెడ్డెప్ప పార్టీ : వైకాపా
విద్యార్హతలు: ఎంఏ, బీఎల్‌
స్థిరచరాస్తుల విలువ: రూ.2.86 కోట్లు
భార్య పేరిట: రూ.29,52,613
కేసులు : లేవు


నియోజకవర్గం: గంగాధరనెల్లూరు
పేరు: కళత్తూరు కృపాలక్ష్మి, పార్టీ: వైకాపా
విద్యార్హతలు: ఎండీ ఆక్యుపôక్చర్‌, బీఏ, ఎల్‌ఎల్‌బీ
స్థిరచరాస్తుల విలువ: రూ.90.12 లక్షలు
భర్త పేరిట ఆస్తులు : రూ.1.17 కోట్లు
కేసులు: లేవు

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని