ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated : 03 May 2024 08:27 IST

ఈనాడు, అమరావతి: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి దుస్థితి ఏ రాష్ట్రంలోనూ ఉండదు. ఇప్పటికే ఉన్నత విద్యను నాశనం చేసిన జగన్‌ ప్రభుత్వం ఉపాధ్యాయ విద్యనూ అధ్వానంగా మార్చేసింది. గతేడాది ఏప్రిల్‌ 23న బీఈడీ ప్రవేశాలకు ప్రకటన విడుదల చేయగా.. 2024 మే నెల వచ్చినా ఆ ప్రక్రియ ఇంకా ముగియలేదు. 2024-25 ప్రవేశాలకు కూడా నోటిఫికేషన్‌ ఇచ్చినప్పటికీ కిందటేడాది ప్రవేశాలే కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 19 నుంచి బీఈడీ తరగతులు ప్రారంభం కాగా.. ఏప్రిల్‌ 4 నుంచి 12 వరకు స్పాట్‌, యాజమాన్య కోటా సీట్ల భర్తీకి అవకాశం కల్పించింది. ఆ తర్వాత గడువును 22 వరకు పొడిగించింది. వెబ్‌సైట్‌లో సమస్యలు వచ్చాయంటూ మళ్లీ అనధికారికంగా 27 వరకు కొనసాగించింది. అపరాధ రుసుముతో సైతం ఆ రోజే గడువు ముగియాల్సి ఉండగా.. దాన్ని మే 2 వరకు కొనసాగిస్తూనే ఉంది.

అన్నీ కాగితాల్లోనే చూపుతున్నారు..

బీఈడీ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో ఏటా రూ.కోట్లు చేతులు మారడం పరిపాటిగా మారింది. రాష్ట్రంలో దాదాపు 98% కళాశాలలు తరగతులే నిర్వహించడం లేదు. ఒక్క అధ్యాపకుడినీ నియమించుకోవడం లేదు. అన్ని కాగితాల్లోనే చూపుతున్నారు. విద్యార్థులకు బయోమెట్రిక్‌ హాజరు ప్రవేశ పెట్టాల్సి ఉన్నా ఉన్నత విద్యామండలి మౌనం వహిస్తోంది. కౌన్సెలింగ్‌లో జాప్యం కారణంగా రెండేళ్ల బీఈడీ కోర్సును 12 నెలల్లోనే ముగించేస్తున్నారు. ప్రాక్టికల్‌ పరీక్షలు చేపట్టడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని