logo

ఉత్తీర్ణత పెరిగి.. స్థానం దిగజారి

పది పరీక్ష ఫలితాలు జిల్లాను కాస్త నిరుత్సాహ పరిచాయి. గతేడాది రాష్ట్రస్థాయిలో ఎనిమిదో స్థానంలో నిలవగా ఈసారి రెండు స్థానాలు దిగజారి పదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Published : 23 Apr 2024 03:01 IST

పది ఫలితాల్లో 90.71% నమోదు
బాలికలు 91.96%, బాలురు 89.58%

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: పది పరీక్ష ఫలితాలు జిల్లాను కాస్త నిరుత్సాహ పరిచాయి. గతేడాది రాష్ట్రస్థాయిలో ఎనిమిదో స్థానంలో నిలవగా ఈసారి రెండు స్థానాలు దిగజారి పదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విద్యాకూడలిగా పేరుగాంచిన తిరుపతిలో ఈ ఫలితాలు ఊహంచనివనే చెప్పాలి. గత ఏడాది 75.76 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ పర్యాయం 90.71% ఉత్తీర్ణత నమోదైనా రాష్ట్రస్థాయిలో మాత్రం నిరుత్సాహపరిచింది. జిల్లా వ్యాప్తంగా బాలికలు 91.96%, బాలురు 89.58 శాతంతో ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో 204 ఉన్నత పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి డా.వి.శేఖర్‌ వెల్లడించారు. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించగా ఏప్రిల్‌ ఒకటి నుంచి ఎనిమిదో తేదీ వరకు జవాబుపత్రాల మూల్యాంకనం జరిగింది.

  • యర్రావారిపాలెం మండలంలో 261 మంది పరీక్ష రాయగా 256 (98.08%) ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 119 మందికిగాను 117 మంది, బాలికలు 142 మందికిగాను 139 మంది ఉత్తీర్ణులయ్యారు.
  • తడ మండలంలో మొత్తం 316 మంది పరీక్షలు రాయగా 221 (69.94%) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 154 మందికి 85 మంది.. బాలికలు 162 మందికి 136 మంది ఉత్తీర్ణులవడం గమనార్హం.

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని