logo

పప్పన్నం లేనట్లే..

రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రతి నెలా బియ్యం కార్డుదారులందరికీ బియ్యం, కందిపప్పు, చక్కెర, గోధుమపిండి అందజేస్తున్నామని ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలే తప్ప.

Published : 02 May 2024 05:41 IST

బియ్యం పంపిణీతోనే సరి
చక్కెర అరకొరనే  

చిత్తూరు(మిట్టూరు), న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రతి నెలా బియ్యం కార్డుదారులందరికీ బియ్యం, కందిపప్పు, చక్కెర, గోధుమపిండి అందజేస్తున్నామని ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలే తప్ప.. క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ తప్పిదాల వల్ల పేద, నిరుపేదలకు కందిపప్పు అందడం లేదు. తద్వారా అమాంతంగా పెరిగిన కందిపప్పు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయలేక కొందరు అవస్థలు పడుతుండగా..మరొకొందరు అప్పోసొప్పో చేసి కొనుగోలుతో ఆర్థిక భారాన్ని మోస్తున్నారు.

ప్రకటనల్లోనే.. : జిల్లాలో 5.43లక్షల బియ్యం కార్డులు ఉన్నాయి. వీరికి ప్రతి నెలా ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు బియ్యం, చక్కెర, కందిపప్పు అందజేయాల్సి ఉంది. అయితే కందిపప్పు గత ఎనిమిది నెలలుగా తూతూమంత్రంగా అందజేసి.. చేతులు దులుపుకొంటున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.170-150 వరకు ధర ఉండటంతో.. ప్రజాపంపిణీ కందిపప్పునకు డిమాండు ఏర్పడింది.

సరిపడా నిల్వలు లేవు..: పౌరసరఫరాల స్ణంస్థ గోదాముల్లో సరిపడా చక్కెర నిల్వలు లేవు. వంద శాతం కార్డుల అందజేయాలంటే.. 270 టన్నులు అవసరం. ప్రభుత్వం జిల్లాకు 280 టన్నులు కేటాయించింది. గోదాముల్లో నిల్వలు లేకపోవడంతో ఇప్పటి వరకు చౌక దుకాణాలకు 159 టన్నులు సరఫరా చేసినట్లు సమాచారం. మిగిలిన చక్కెర గోదాములకు చేరేదెన్నడు.. ఆపై దుకాణాలకు వచ్చేదెన్నడో తెలియని పరిస్థితి. ఇక గోధుమపిండి అంతంత మాత్రమే. రాగిపిండి పంపిణీ లేనట్లేనని తెలిసింది. ఈ నెల కోటాలో  బియ్యం పంపిణీ మొదలైంది. వంద శాతం కార్డులకు అన్ని రకాల సరకులు అందజేస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని