logo

కవ్వించి.. దాడిచేసి

మండల కేంద్రమైన ఐరాలలో మంగళవారం మధ్యాహ్నం వైకాపా, తెదేపా నాయకులు మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది.

Published : 08 May 2024 05:39 IST

ఐరాలలో తెదేపా శ్రేణులపై వైకాపా మూకదాడి

ఐరాల బజారువీధిలో ఘర్షణకు దిగిన వైకాపా, తెదేపా నాయకులు, కార్యకర్తలు

ఐరాల, న్యూస్‌టుడే: మండల కేంద్రమైన ఐరాలలో మంగళవారం మధ్యాహ్నం వైకాపా, తెదేపా నాయకులు మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. పూతలపట్టు నియోజకవర్గ తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్‌ ర్యాలీ నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలు ఐరాలలోని బజారువీధిలో జెండాలు కడుతున్నారు. ఆ సమయంలో కొందరు వైకాపా నాయకులు, కార్యకర్తలు పోటీగా వైకాపా జెండాలు కట్టారు. అదేమిటని తెదేపా నాయకులు ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అటుగా వెళ్తున్న తెదేపా నాయకుల కారుపై వైకాపా కార్యకర్తలు దాడి చేయడంతో అద్దాలు పగిలాయి. దీంతో ఘర్షణ కాస్తా ఉద్రిక్తతకు దారితీసింది. వైకాపా, తెదేపా నాయకులు, కార్యకర్తలు పరస్పర దాడులకు సిద్ధమవడంతో స్థానిక పోలీసులు వారిని అదుపు చేయడానికి ప్రయత్నించారు. చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి ప్రత్యేక బలగాలతో అక్కడకు వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు. తెదేపా నాయకులను అరెస్ట్‌ చేయాలని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌కుమార్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

వైకాపా ఆగడాలకు అడ్డుకట్ట వేయండి.. ఓటమి భయంతో నియోజకవర్గంలో వైకాపా నాయకులు చేస్తున్న ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్‌ చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డిని కోరారు. ఆయన ఐరాలకు వచ్చి డీఎస్పీతో మాట్లాడారు. తాము ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటుంటే వైకాపా నాయకులు, కార్యకర్తలు నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని, దీనిపై విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు