logo
Published : 29/11/2021 02:02 IST

సమకూరితే.. వసతి కష్టాలు తీరినట్లే


సత్యగిరిపై నిర్మిస్తున్న 135 గదుల శివసదన్‌ వసతి సముదాయం

అన్నవరం: అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు వసతి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రద్దీ రోజుల్లో వసతి దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరుబయటే ఉండేవారు ఎందరో. వివాహ ముహూర్తాల సమయంలో.. పవిత్ర కార్తికమాసం ఇతర పర్వదినాల్లో విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. అపుడు వసతి కేటాయించడం కష్టంగా ఉంటోంది. సిఫార్సు లేఖలకు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో సాధారణ భక్తులకు దొరకట్లేదు. కొంతమంది సీఆర్వో కార్యాలయం వద్ద ఇటీవల ఆందోళన చేశారు. ఈ పరిస్థితులు అధిగమించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఆయా పనులు పూర్తైతే సమస్య కొంత తీరినట్లే..!

ప్రణాళిక ఇలా..

135 గదుల శివసదన్‌ వసతి సముదాయం నిర్మాణం పూర్తైన తర్వాత హరిహరసదన్‌ ఎదురుగా మరో 135 గదుల వసతి సముదాయం (మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం) నిర్మాణానికి ప్రణాళిక చేస్తున్నారు.

దాత సహకారంతో రూ.రెండు కోట్లతో డార్మెటరీ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారు. రత్నగిరి సత్రం తొలగించి దీని స్థానంలో డార్మెటరీ జీప్లస్‌-1లో నిర్మించనున్నారు. ఇది పూర్తైతే 400-500 మందికి వసతి అందుబాటులోకి వస్తుంది.

కొండ దిగువన ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదురుగా దేవస్థానం స్థలంలో డార్మెటరీ నిర్మాణానికి ప్రణాళిక చేశారు. కేంద్ర పథకం ప్రసాద్‌ ద్వారా దీన్ని నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నారు. సుమారు రూ.ఎనిమిది కోట్ల అంచనాతో జీ ప్లస్‌-2 భవనం నిర్మించనున్నారు.

ఆరు నెలల్లో...

సత్యగిరిపై 135 గదుల శివసదన్‌ (హరిహరసదన్‌ మాదిరిగా) వసతి సముదాయం నిర్మాణం చురుగ్గా జరుగుతోంది. రూ.16 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. జీ ప్లస్‌-4తో నిర్మిస్తున్న భవనంలో దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయి. మరో ఆరునెలల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ భవన నిర్మాణం పూర్తైతే 135 గదులు అందుబాటులోకి రానున్నాయి.

చక్కదిద్దేందుకు చర్యలు..

రద్దీ సమయాల్లో వసతి గదులకు తీవ్ర డిమాండ్‌ ఉంటోంది. వసతి సౌకర్యాలు మెరుగుపర్చేందుకు ప్రణాళిక చేశాం. త్వరలో మరిన్ని వసతిగదులు అందుబాటులోకి వస్తాయి. దాతలు, కేంద్ర ప్రభుత్వ పథకం ప్రసాద్‌ ద్వారా డార్మెటరీలు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. -వి.త్రినాథరావు, ఈవో, అన్నవరం

వసతి గదులు: 500 (రత్న, సత్యగిరులపై)

డిమాండ్‌: 1,000-1,500 (వివాహ ముహూర్తాలు, కార్తికం, ఇతర పర్వదినాల్లో)

ఏటా వచ్చే ఆదాయం: సుమారు రూ. 8-9 కోట్లు

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని