logo

వన్‌ ధన్‌ వికాస కేంద్రాలకు సౌర సొబగులు

తక్కువ ఖర్చుతో సమర్థ విద్యుత్తు సేవల దిశగా రంపచోడవరం ఐటీడీఏ దృష్టిసారించింది. ఈ   పరిధిలో గిరిజనుల ఆర్థికాభివృద్ధికి.. అటవీ ఉత్పత్తులకు విలువలు జోడించడానికి నిర్దేశించిన వన్‌ ధన్‌ వికాస కేంద్రాలకు (వీడీవీకే) సౌర విద్యుత్తు వెలుగులు నింపే దిశగా

Published : 20 Jan 2022 05:42 IST


చింతపండు తొక్కతీస్తున్న గిరిజన మహిళలు

ఈనాడు - కాకినాడ: తక్కువ ఖర్చుతో సమర్థ విద్యుత్తు సేవల దిశగా రంపచోడవరం ఐటీడీఏ దృష్టిసారించింది. ఈ   పరిధిలో గిరిజనుల ఆర్థికాభివృద్ధికి.. అటవీ ఉత్పత్తులకు విలువలు జోడించడానికి నిర్దేశించిన వన్‌ ధన్‌ వికాస కేంద్రాలకు (వీడీవీకే) సౌర విద్యుత్తు వెలుగులు నింపే దిశగా కార్యాచరణకు సిద్ధమైంది. ఐటీడీఏ విన్నపం మేరకు ఆంధ్రప్రదేశ్‌ నూతన- పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్‌) రంప ఐటీడీఏ పరిధిలోని 15 కేంద్రాల్లో సౌర విద్యుత్తు కల్పనకు అవసరాలపై ఇటీవల సర్వే నిర్వహించింది. రంపచోడవరం, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, వై.రామవరం, రాజవొమ్మంగి మండలాల పరిధిలో కేంద్రాలను నెడ్‌క్యాప్‌ జిల్లా మేనేజర్‌ పి.విజయరామరాజు ఆధ్వర్యంలోని బృందం సందర్శించి సౌర విద్యుత్తు అవసరాలను గుర్తించింది. ఇప్పటికే ఆయా వీడీవీకేల్లో చింతపండు తొక్కతీయడం, పసుపు ఎండబెట్టడం, జీడిపిక్కల తొక్కతీయడం వంటి చిన్నతరహా పరిశ్రమలు ఐటీడీఏ- ట్రైఫెడ్‌ ఊతంతో నడుస్తున్నాయి. ఆయా కేంద్రాలకు తొలిదశలో విద్యుత్తు కనెక్షన్లు ఏర్పాటుచేసి తొలి బిల్లు వచ్చిన తర్వాత ఆయా అవసరాలకు, సామర్థ్యానికి అనుగుణంగా సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. ఒక్కో కేంద్రానికి మూడు కిలో వాట్ల వరకు సామర్థ్యంగల సౌర ఫలకలు అవసరమనే ప్రాథమిక అంచనాకు నెడ్‌క్యాప్‌ అధికారులు వచ్చారు. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే తక్కువ ఖర్చుతో మన్యంలోని వీడీవీకేలకు సమర్థ సౌర వెలుగులు చేరువయ్యే వీలుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని