logo

పుష్కర కాలువ ధ్వంసంపై విచారణ చేపట్టాలి: నెహ్రూ

మండలంలోని రామవరంలో సర్వే నం.108, 124లో ఉన్న పుష్కర కాలువ ధ్వంసం ఘటనపై జిల్లా కలెక్టర్‌ పూర్తిస్థాయి విచారణ చేపట్టి వాస్తవాలు వెలికితీయాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ డిమాండ్‌ చేశారు. ఇర్రిపాకలోని ఆ

Published : 22 Jan 2022 05:23 IST

జగ్గంపేట గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని రామవరంలో సర్వే నం.108, 124లో ఉన్న పుష్కర కాలువ ధ్వంసం ఘటనపై జిల్లా కలెక్టర్‌ పూర్తిస్థాయి విచారణ చేపట్టి వాస్తవాలు వెలికితీయాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ డిమాండ్‌ చేశారు. ఇర్రిపాకలోని ఆయన స్వగృహం నుంచి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పలు వివరాలను వెల్లడించారు. కాలువ ధ్వంసం చేసిన వైకాపా నాయకుడిని తప్పించి పూటకూలికి వెళ్లిన వ్యక్తిపై, కాలువ పక్కనే ఉన్న భూమి యజమాని(ప్రముఖ సినీనటుడి తల్లి)పై కేసు పెట్టడం చూశామన్నారు. ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యేతో తాను మిలాకత్‌ అయి దీనిగురించి పట్టించుకోవడంలేదని వదంతులు వస్తున్నాయని, దీనిని ఖండిస్తున్నట్లు నెహ్రూ తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గంలో విచ్చలవిడిగా జూదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. క్యాసినో వంటి సంస్కృతిని గుడివాడలో ఏర్పాటు చేసిన మంత్రి కొడాలి నానిపై డీజీపీ స్థాయి అధికారితో విచారణ చేపట్టాలని, మంత్రిని బర్తరఫ్‌ చేయాలన్నారు. నీతివంతమైన పాలన అందిస్తానని కబుర్లు చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కళ్లుతెరిచి వాస్తవాన్ని గ్రహించి మంత్రిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని