logo

విద్యార్థుల ఉన్నత భవితకు మార్గదర్శనం

విద్యార్థులకు జీవన నైపుణ్యాలు, కెరీర్‌పై స్పష్టత అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమగ్ర అభివృద్ధి విధానానికి జీవన నైపుణ్యాలు, కెరీర్‌ గైడెన్స్‌ కార్యక్రమాన్ని రూపొందించింది. 9 నుంచి 12 తరగతుల వారికి దీన్ని అమలు

Published : 24 Jan 2022 05:04 IST


కృత్య పుస్తకం ముఖచిత్రం

పామర్రు: విద్యార్థులకు జీవన నైపుణ్యాలు, కెరీర్‌పై స్పష్టత అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమగ్ర అభివృద్ధి విధానానికి జీవన నైపుణ్యాలు, కెరీర్‌ గైడెన్స్‌ కార్యక్రమాన్ని రూపొందించింది. 9 నుంచి 12 తరగతుల వారికి దీన్ని అమలు చేస్తున్నారు. జిల్లా నుంచి 1,49,457 మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారని డీఈవో ఎస్‌.అబ్రహం వెల్లడించారు. ఇప్పటికే శిక్షణ పూర్తయిన రాష్ట్ర వనరుల బృంద సభ్యులు జిల్లాలోని అన్ని విద్యాశాఖ డివిజన్లలో 24, 25 తేదీల్లో ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తారు. జిల్లాలో 659 పాఠశాలల నుంచి 659 మంది ఇందులో పాల్గొంటారు.

ఏమిటీ శిక్షణ..

కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు, ఉపాధ్యాయులు వారి కుటుంబాల్లో విపత్తును ఎదుర్కొనేలా మానసిక ధైర్యాన్ని నింపడానికి, మానసిక ఆరోగ్య పరిరక్షణకు, భావోద్వేగాల పరిరక్షణకు అవసరమైన జీవన నైపుణ్యాలు చెబుతారు. విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రులకు కూడా అందేలా చూస్తారు.

కెరీర్‌ పోర్టల్‌లో సమాచారం..

రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ, పాఠశాల విద్య, యూనిసెఫ్‌ భారతీయ విభాగం, ఆస్మాన్‌ ఫౌండేషన్‌ సహకారంతో విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా కెరీర్‌ పోర్టల్‌ ఏర్పాటు చేశారు. ఇందులో 21,000 కళాశాలలు, 1,150 ప్రవేశ పరీక్షలు, 1,200 రకాల ఉపకార వేతనాలు, 555 విద్యా, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. విద్యార్థులందరూ వారి చైల్డ్‌ఐడీని ఉపయోగించి ఇందులో సమాచారాన్ని ఉచితంగా తెలుసుకోవచ్ఛు డౌన్లోడ్‌ కూడా చేసుకోవచ్ఛు ఐడీని ఆయా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల ద్వారా తెలుసుకోవచ్ఛు

మంచి అవకాశం..

విద్యార్థులకు మంచి అవకాశం. ఉపకార వేతనాలు, అవకాశాలు, ఇతర అంశాలు తెలుసుకోవచ్ఛు శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఆయా విషయాలను విద్యార్థులకు వివరిస్తారు. దీనిపై పిల్లలకు ఓ పుస్తకం కూడా ఇస్తారు. -ఎన్‌.రాజు, రాష్ట్ర వనరుల బృంద సభ్యుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని