logo

ఆగని మట్టి తరలింపు.. అడ్డుకున్న గ్రామస్థులు

గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి సమయంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను గ్రామస్థులు అడ్డుకొని అధికారులకు అప్పగించారు. గోకవరం మండలం కృష్ణునిపాలెం గ్రామ ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న కాలువను రియల్టర్లు ఆక్రమించారు.

Published : 24 Jan 2022 05:04 IST

గోకవరం, న్యూస్‌టుడే: గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి సమయంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను గ్రామస్థులు అడ్డుకొని అధికారులకు అప్పగించారు. గోకవరం మండలం కృష్ణునిపాలెం గ్రామ ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న కాలువను రియల్టర్లు ఆక్రమించారు. రాత్రిపూట మట్టి తరలించి కాలువను కప్పేయడం ప్రారంభించారు. శనివారం ఉదయం గమనించిన గ్రామస్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. దాంతో రాత్రి లారీలతో మట్టి తవ్వి తరలిస్తుండగా అడ్డుకున్నారు. గ్రామ ఉప సర్పంచి కిశోర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే రెండు లారీలు అక్కడ నుంచి వెళ్లిపోయాయి. ఒక లారీని పట్టుకొని గోకవరం పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం అక్కడ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కిశోర్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని