logo

మంత్రి మెప్పు పొందాలని నాయకుల పాట్లు

గ్రామీణ నియోజకవర్గంలో వైకాపా కేడర్‌కు చేరికల పాట్లు తప్పడం లేదు. మంత్రి వేణు మెప్పు పొందేందుకు ద్వితీయశ్రేణి నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు.

Published : 27 Apr 2024 06:06 IST

ఈనాడు, రాజమహేంద్రవరం: గ్రామీణ నియోజకవర్గంలో వైకాపా కేడర్‌కు చేరికల పాట్లు తప్పడం లేదు. మంత్రి వేణు మెప్పు పొందేందుకు ద్వితీయశ్రేణి నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. తాజాగా కడియం మండలం కడియపులంక పరిధిలోని బుర్రిలంకలో వైకాపా మండల జేసీఎస్‌ సమన్వయకర్త తాడాల విష్ణుచక్రవర్తి ఆధ్వర్యంలో కడియపులంక నుంచి భారీ చేరికలంటూ ఊదర గొట్టారు. శుక్రవారం రాత్రి చక్రవర్తి నర్సరీలో వేదిక ఏర్పాటు చేశారు. తండోపతండాలుగా వస్తారనుకున్న కార్యకర్తలు రాకపోవడంతో వీరవరం, దుళ్ల, దామిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన పలువురు కార్మికులను డబ్బులిచ్చి తీసుకువచ్చారు. మంత్రి చేతులమీదుగా కండువాలు గప్పి మమ అనిపించారు. ఈ కార్యక్రమానికి వైకాపా రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ను ఆహ్వానించారు. ఆయన ఫోటో అక్కడ ఉన్న ఏ ఫ్లెక్సీలోనూ లేకపోవడంతో ఆయన నొచ్చుకుని వెంటనే వెనుదిరిగారు. ఇది గమనించిన ఆ పార్టీ శ్రేణులు హడావిడిగా ఆయన ఫొటోలను ఫ్లెక్సీలపై అప్పటికప్పుడు అతికించి తిరిగి ఆయన్ను ఆహ్వానించారు. ఈ తంతు చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని