logo

యనమల నిజాన్ని ఒప్పుకోగలరా?: రాజా

తన వెనుక తిరిగిన వ్యక్తి చేసిన తప్పును తాను భరించి రూ.4 కోట్లు చెల్లించానని, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తన సోదరుడు కృష్ణుడు చేసిన తప్పిదాలను అలా ఒప్పుకోగలరా? అని మంత్రి దాడిశెట్టి రాజా సవాల్‌ విసిరారు.

Published : 04 Feb 2023 05:25 IST

మాట్లాడుతున్న మంత్రి దాడిశెట్టి రాజా

తుని, న్యూస్‌టుడే: తన వెనుక తిరిగిన వ్యక్తి చేసిన తప్పును తాను భరించి రూ.4 కోట్లు చెల్లించానని, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తన సోదరుడు కృష్ణుడు చేసిన తప్పిదాలను అలా ఒప్పుకోగలరా? అని మంత్రి దాడిశెట్టి రాజా సవాల్‌ విసిరారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రిగా యనమల రామకృష్ణుడు కేవలం రెండు నియోజకవర్గాల కోసం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంలో తన వెనుక తిరిగిన వెంకటేష్‌ రూ.4 కోట్ల అవినీతికి పాల్పడడంతో, చేయని తప్పును మీద వేసుకుని ఆ మొత్తాన్ని భరించానని, యనమల అలా చేయగలరా? అని ప్రశ్నించారు. తునిలో శుక్రవారం జరిగిన వాలంటీర్లు, గృహసారథుల శిక్షణ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ యనమలను ఉద్దేశించి పైవ్యాఖ్యలు చేశారు.  తనకు సంబంధం లేకున్నా తెదేపా నాయకులు గతంలో రైలు దహనం కేసులో అన్యాయంగా ఇరికించారని, అనేక కేసులుపెట్టి ఎంతగానో వేధించారని రాజా అన్నారు. వాలంటీర్లకు బంధువులుగా ఉన్నవారినే గృహ సారథులు, కన్వీనర్లుగా నియమించినందున పొరపొచ్చాలు లేకుండా అంతా కలిసి పార్టీ కోసం పనిచేయాలన్నారు. తుని పురపాలక ఛైర్‌పర్సన్‌ ఏలూరి సుధారాణి, నాయకులు బాలు, రేలంగి రమణాగౌడ్‌, పామర్తి మహేష్‌, కుచ్చర్లపాటి రూపాదేవి తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని