logo

దొరకునా ఇటువంటి సేవాభాగ్యం..!

అనోన్య దాంపత్యానికి దివ్యత్యాన్ని ఆపాదించి సిరులతల్లిని తన హృదయంపై నిలుపుకొన్న దేవదేవుడు సుందర దరహాసంతో భక్తులకు దర్శనమిచ్చిన కమనీయ ఘట్టం అంతర్వేది ఉత్సవాల్లో ఏడో రోజైన శుక్రవారం నయన మనోహరమైంది.

Published : 04 Feb 2023 05:25 IST

న్యూస్‌టుడే: అంతర్వేది, మామిడికుదురు

హనుమద్వాహనంపై ఊరేగుతున్న స్వామివారు

నోన్య దాంపత్యానికి దివ్యత్యాన్ని ఆపాదించి సిరులతల్లిని తన హృదయంపై నిలుపుకొన్న దేవదేవుడు సుందర దరహాసంతో భక్తులకు దర్శనమిచ్చిన కమనీయ ఘట్టం అంతర్వేది ఉత్సవాల్లో ఏడో రోజైన శుక్రవారం నయన మనోహరమైంది. పరిణయోత్సవం పూర్తయిన నాలుగో రోజు దివ్యమూర్తులకు ఆశీర్వచనం పలికే సేవా భాగ్యం తమకు కలగడం ఎంతో అదృష్టంగా వైదిక బృందం వల్లించిన మంత్రోచ్చారణలు రమణీయంగా ప్రతిధ్వనించాయి లక్ష్మీనృసింహస్వామి వారికి ఉదయం సుప్రభాతం, తిరువారాధన, బాలభోగ కైంకర్యాలు పూర్తయ్యాక ప్రత్యేకంగా అలంకరణ చేశారు. సాయంత్రం 4.10 గంటలకు హనుమద్వాహనంపై ఉత్సవమూర్తుల ను కొలువుదీర్చారు.  సాయంత్రం 5.30 గంటలకు ఆలయంలో స్వామివారికి పండిత సదస్యం ఏర్పాటైంది. ధూపసేవ చేశాక రాత్రి 7.15 గంటలకు స్వర్ణ కాంతులతో విరాజిల్లుతున్న దివ్యమూర్తులు సింహ వాహనంపై కొలువుదీరి భక్తులకు అభయ ప్రదానం చేస్తూ వినువీధిలో విహరించారు.

అంతర్వేదిలో ‘ఈనాడు’

ఉదయం సుప్రభాత సేవ, తిరువారాధన బీ సాయంత్రం 4 గంటలకు రాజాధిరాజ వాహనసేవ బీ రాత్రి 7 గంటలకు అశ్వ వాహనంపై ఊరేగింపు బీ 7.30 గంటలకు 16 కాళ్ల మండపం వద్ద చోరసంవాదం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని