logo

‘శాసనసభ చరిత్రలో చీకటిరోజు’

రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఇది ఒక దుర్దినమని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం అనపర్తి తెదేపా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో నం 1 రద్దు చెయాలని తెదేపా సభ్యులు...

Updated : 21 Mar 2023 06:03 IST

అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నిరసన

అనపర్తి: రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఇది ఒక దుర్దినమని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం అనపర్తి తెదేపా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో నం 1 రద్దు చెయాలని తెదేపా సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చి, దానిపై మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరుతూ స్పీకర్‌ పోడియం వద్ద డిమాండు చేస్తున్న సమయంలో బాల వీరాంజనేయస్వామిపై దాడి చేయడానికి ఇద్దరు ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేలు ప్రయత్నించడం, ఆయనను కాపాడే ప్రయత్నంలో బుచ్చియ్యచౌదరిపై దాడికి పాల్పడే పరిస్థితికి వెల్లంపల్లి శ్రీనివాస్‌ రావడం దురదృష్టకరమన్నారు. శాసన సభాపతి ప్రవర్తిస్తున్న తీరు, సభ నిర్వహిస్తున్న తీరు ఆక్షేపణీయంగా ఉందన్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి డిమాండు చేశారు. నాయకులు దత్తుడు శ్రీను, నాగేశ్వరరావు, వెంకట రామారెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్రీను, బాబూరావు, వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

కొవ్వొత్తులతో నిరసన

బిక్కవోలు: అసెంబ్లీలో ఎమ్మెల్యేలు బాలవీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై సోమవారం జరిగిన దాడికి నిరసనగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బలభద్రనగరం దళితవాడ వద్దగల అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కొవ్వొత్తులు వెలిగించి మౌనం పాటించారు. విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. రామకృష్ణారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు కోల్పోవటంతో తీవ్ర అసహనానికి లోనైన జగన్‌ మోహన్‌రెడ్డి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తెదేపా మండల శాఖ మాజీ అధ్యక్షుడు నల్లమిల్లి వెంకట సుబ్బారెడ్డి, నాయకులు తమలంపూడి సుధాకరరెడ్డి, దత్తుడు సుబ్బారెడ్డి, వెంకట రెడ్డి, సత్యనారాయణ రెడ్డి కనికెళ్ల చిన్న తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని