logo

Annavaram: రత్న, సత్యగిరులు చుట్టేలా.. భక్తజనం మురిసేలా

కార్తిక పౌర్ణమి సందర్భంగా త్రిమూర్తి రూపం అన్నవరం సత్యనారాయణ స్వామి గిరిప్రదక్షిణ సోమవారం నిర్వహించనున్నారు. రత్నగిరి తొలిపావంచా నుంచి (కొండ దిగువున మెట్లమార్గం ప్రారంభం) రత్న, సత్యగిరిలను చుడుతూ పంపా తీరం మీదుగా తిరిగి తొలి పావంచా వద్ద ప్రదక్షిణ ముగుస్తుంది.

Updated : 26 Nov 2023 08:55 IST

రేపు ఉదయం 8 నుంచి గిరి ప్రదక్షిణ
ప్రదక్షిణ మార్గం దూరం: 8.4 కి.మీ.

గిరి ప్రదక్షిణ మార్గం

  • సత్యదేవుని ఉత్సవమూర్తులను పల్లకిలో సోమవారం ఉదయం 7.30 గంటలకు కొండపై నుంచి మెట్లమార్గంలో తొలి పావంచాల వద్దకు తీసుకువస్తారు.
  • ప్రత్యేక పూజల అనంతరం8 గంటలకు ప్రదక్షిణ ప్రారంభం

అన్నవరం: కార్తిక పౌర్ణమి సందర్భంగా త్రిమూర్తి రూపం అన్నవరం సత్యనారాయణ స్వామి గిరిప్రదక్షిణ సోమవారం నిర్వహించనున్నారు. రత్నగిరి తొలిపావంచా నుంచి (కొండ దిగువున మెట్లమార్గం ప్రారంభం) రత్న, సత్య
గిరిలను చుడుతూ పంపా తీరం మీదుగా తిరిగి తొలి పావంచా వద్ద ప్రదక్షిణ ముగుస్తుంది. ఆ రోజు ఉదయం 8 గంటలకు ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. సుమారు లక్ష మందికి పైబడి భక్తులు వస్తారని అంచనా.

ఎలా చేరుకుంటారంటే..

అన్న వరంలోని ప్రధానమార్గం, సుబ్రహ్మణ్యస్వామి ఆలయం, సుబ్బరాయపురం, సాక్షిగణపతి ఆలయం మీదుగా జాతీయ రహదారిపైకి ప్రదక్షిణ చేసేవారు చేరుకుంటారు. బెండపూడి గ్రామానికి ముందు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న పోలవరం కాలువ గట్టు మీదుగా పంపా సరోవరం చెంతకు...అలానే పంపా రిజర్వాయర్‌ చెంత నుంచి ఘాట్‌ మీదుగా (రత్న, సత్యగిరులను చుడుతూ) దిగువ ఘాట్‌రోడ్డు నుంచి తిరిగి తొలిపావంచాల వద్దకు చేరుకుంటారు. అదనపు ఎస్పీ ఆధ్వర్యాన ఇద్దరు డీఎస్పీలు, ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్సైలు, 150 మంది సిబ్బంది, దేవస్థానం భద్రతా సిబ్బంది పర్యవేక్షించనున్నారు. ్య సాక్షి గణపతి ఆలయం, బెండపూడి కూడలి, పోలవరం గట్టు మార్గం, పంపాఘాట్‌ వద్ద వేదికలు ఏర్పాటుచేస్తున్నారు. వాటి వద్ద స్వామి, అమ్మవార్ల పల్లకీని కాసేపు నిలుపుతారు. ్య భక్తులకు పండ్లు, ప్రసాదం, తాగునీరు, మజ్జిగ, పాలు పంపిణీకి దేవస్థానం 6 ..స్వచ్ఛంద సంస్థలు, దాతలు మరో 20 స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ్య తాత్కాలిక మరుగుదొడ్లు, మూత్ర విసర్జన శాలలు, వైద్య శిబిరాలు, ఇతర సౌకర్యాలు సమకూర్చుతున్నారు. ప్రదక్షిణ మార్గంలో రాళ్లు గుచ్చుకోకుండా చదును చేసి నీటితో తడుపుతున్నారు. ఎండుగడ్డి వేస్తారు. ్య ఈవో కె.రామచంద్రమోహన్‌ మాట్లాడుతూ..‘గిరి ప్రదక్షిణకు సుమారు లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నాం. పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకున్నామ’ని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని