logo

సమగ్ర వ్యయ పర్యవేక్షణకు చర్యలు

సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చులపై సమగ్ర పర్యవేక్షణకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాధవీలత తెలిపారు.

Published : 20 Apr 2024 02:32 IST

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ మాధవీలత, చిత్రంలో ఎన్నికల వ్యయపరిశీలకులు, ఇతర అధికారులు

రాజమహేంద్రవరం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చులపై సమగ్ర పర్యవేక్షణకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎన్నికల ఖర్చుల పర్యవేక్షణపై జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు నోడల్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని అనుసరించి కార్యాచరణ రూపొందించామని, సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలపై నిఘా పెట్టామని తెలిపారు. దీనిలో భాగంగా 24 వీడియో సర్వైవల్‌ బృందాలను నియమించామన్నారు. వీటికి అదనంగా 25 వీడియో, 16 అకౌంటింగ్‌ బృందాలు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. సమగ్ర వ్యయ పర్యవేక్షణకు చర్యలు తీసుకున్నామని, దానికనుగుణంగా సంబంధిత శాఖల ఆధ్వర్యంలో కోర్‌ కమిటీని నియమించామన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు రోహిత్‌నగర్‌, నితిన్‌కురాయిన్‌, జైఅరవింద్‌లు క్షేత్రస్థాయి పర్యటన నేపథ్యంలో రికార్డుల నిర్వహణ, ఎన్నికల ఖర్చుల పర్యవేక్షణపై సమీక్షించారు. రాజకీయ పార్టీలు చేస్తున్న ఖర్చులపై నిఘా పెట్టామని, ఇకపై నామినేషన్‌ దాఖలు చేసిన అభ్యర్థుల ఖాతాల కింద ఖర్చులను నమోదు చేస్తామని తెలిపారు. సమావేశంలో జేసీ తేజ్‌భరత్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ దినేష్‌కుమార్‌, డీఆర్వో జి.నరసింహులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని