logo

పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల బరిలో 13 మంది

పిఠాపురం అసెంబ్లీ స్థానానికి ఎన్నికల బరిలో 13 మంది నిలిచారు. ఆ వివరాలను ఆర్వో రామసుందర్‌రెడ్డి వెల్లడించారు.

Published : 01 May 2024 05:35 IST

పిఠాపురం, న్యూస్‌టుడే: పిఠాపురం అసెంబ్లీ స్థానానికి ఎన్నికల బరిలో 13 మంది నిలిచారు. ఆ వివరాలను ఆర్వో రామసుందర్‌రెడ్డి వెల్లడించారు. మొత్తం 23 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. పరిశీలనలో ఒకటి తొలగిపోయింది. 9 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు బ్యాలెట్‌లో ఉన్న మేరకు వరుసగా చూస్తే.. బుల్లి రాజు పత్తిపాటి, బీఎస్పీ పార్టీ (ఏనుగు), మాదేపల్లి సత్యానందరావు, కాంగ్రెస్‌ (హస్తం), వంగా గీత విశ్వనాథ్‌, వైకాపా (సీలింగ్‌ ఫ్యాను), కొణిదెల పవన్‌ కల్యాణ్‌, జనసేన పార్టీ (గాజు గ్లాసు), జగ్గారాపు మల్లిఖార్జున రావు, జైభీమ్‌ రావు భారత్‌ పార్టీ (కోటు), తమన్నా సింహాద్రి, భారత చైతన్య యువజన పార్టీ (గన్నా కిసాన్‌), పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు, తెలుగు జనతా పార్టీ (మైక్‌), మద్దూరి వీరబాబు, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ప్లూట్‌), స్వతంత్ర అభ్యర్థులు ఈటీ జగదీష్‌ (బ్యాటరీ టార్చి), ఏడిద భాస్కరరావు (టెలివిజన్‌), గౌరీమణి బొలిశెట్టి (లెటర్‌ బాక్స్‌), నాగం సూరిబాబు (డిష్‌ యాంటెన్న), సాయి సూర్య నిఖిల్‌ వేగిశెట్టి (బెలూన్‌) గుర్తులు కేటాయించినట్లు ఆర్వో తెలిపారు. దీంతో వీరంతా తమ గుర్తులతో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని