logo

పోస్టల్‌ బ్యాలెట్‌ @ 18,715

ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం ఈనెల 8వ తేదీ వరకు కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్‌, రిటర్నింగ్‌ అధికారి జె.నివాస్‌ తెలిపారు.

Published : 05 May 2024 03:51 IST

కాకినాడ జిల్లాలో తొలిరోజు లెక్కపై కలెక్టర్‌ స్పష్టత

రమణయ్యపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ జె.నివాస్‌

సర్పవరం జంక్షన్‌, కాకినాడ కలెక్టరేట్‌, పెద్దాపురం: ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం ఈనెల 8వ తేదీ వరకు కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్‌, రిటర్నింగ్‌ అధికారి జె.నివాస్‌ తెలిపారు. కాకినాడ జిల్లాలో మొదటి రోజు 18,715 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటుహక్కు వినియోగించుకున్నారన్నారు. రమణయ్యపేట ఏపీఎస్పీ జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పోస్టల్‌ బ్యాలెట్‌ కార్యక్రమం, తిమ్మాపురంలో అక్నూ ఎంఎస్‌ఎన్‌ పీజీ క్యాంపస్‌ ఈవీఎం, వీవీ ప్యాట్స్‌ కమిషనింగ్‌ ప్రక్రియను పరిశీలించారు.

నేటి నుంచి బ్యాలెట్‌ పత్రాల అనుసంధానం

జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కేటాయించిన ఎన్నికల పోలింగ్‌ సామగ్రి పంపిణీ కేంద్రాల్లో ఆదివారం నుంచి ఈవీఎంలకు బ్యాలెట్‌ పత్రాల అనుసంధానం ప్రక్రియను చేపట్టనున్నారు. శనివారం కాకినాడ మెక్లారిన్‌ ఉన్నత పాఠశాలలో ఈ ప్రక్రియ నిర్వహణకు చేసిన ఏర్పాట్లను కలెక్టర్‌ పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో ఇంటి నుంచే ఓటు ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నామన్నారు. పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించిన ప్రక్రియను శనివారం పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని