logo

విజయ శంఖారావం సభకు విస్తృత ఏర్పాట్లు

సార్వత్రిక ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంటున్న సమయంలో కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ పాల్గొనే ‘విజయ శంఖారావం’ సభకు రాజమహేంద్రవరంలో చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి.

Published : 05 May 2024 03:54 IST

రేపు రానున్న ప్రధాని..తెదేపా, జనసేన అధినేతలు
వేమగిరిలో చురుగ్గా పనులు

సభ నిర్వహించే ప్రధాన వేదిక వద్ద ఏర్పాట్లు

ఈనాడు, రాజమహేంద్రవరం; న్యూస్‌టుడే, కడియం: సార్వత్రిక ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంటున్న సమయంలో కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ పాల్గొనే ‘విజయ శంఖారావం’ సభకు రాజమహేంద్రవరంలో చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈనెల 6న (సోమవారం) రాజమహేంద్రవరంలోని వేమగిరి జాతీయ రహదారికి ఆనుకుని నిర్వహించే సభలో ప్రధానితోపాటు తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ పాల్గొంటారు. గత ఏడాది మేలో తెదేపా మహానాడు నిర్వహించిన స్థలంలోనే విజయ శంఖారావం నిర్వహిస్తున్నారు. సభాస్థలి వద్ద ప్రధాన వేదికతోపాటు, ఇరు వైపులా మరో రెండు వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. సమీపంలో హెలీప్యాడ్‌లు సిద్ధం  చేస్తున్నారు. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, ఏలూరు, నర్సాపురం పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధి నుంచి మూడు పార్టీల శ్రేణులు దాదాపు 2 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని నాయకుల అంచనా..ప్రధాని మోదీ సోమవారం మధ్యాహ్నం 2.55 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో సభా ప్రాంగణానికి సుమారు 3 గంటల సమయంలో చేరే అవకాశం ఉంది. 3.30 గంటలకు వేదిక వద్దకు చేరుకుంటారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, తెదేపా అధినేత చంద్రబాబు, అనంతరం ప్రధాని మోదీ ప్రసంగిస్తారని పార్టీ నాయకులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని