logo

వైకాపా, కూటమి శ్రేణుల ప్రచారంలో ఉద్రిక్తత

పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం చెందుర్తిలో బుధవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. వైకాపా, కూటమి శ్రేణులు ఒకేసారి ప్రచారానికి రావడంతో ఈ సమస్య ఏర్పడగా.. డప్పు కళాకారుడిపై స్థానిక ఎస్సై చేయి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది..

Published : 09 May 2024 04:45 IST

డప్పు కళాకారుడిపై చేయి చేసుకున్న ఎస్సై

కూటమి నాయకులు, కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు

గొల్లప్రోలు, న్యూస్‌టుడే: పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం చెందుర్తిలో బుధవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. వైకాపా, కూటమి శ్రేణులు ఒకేసారి ప్రచారానికి రావడంతో ఈ సమస్య ఏర్పడగా.. డప్పు కళాకారుడిపై స్థానిక ఎస్సై చేయి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది.. వైకాపాకు అనుకూలంగా ప్రవర్తిస్తూ, తమను మాత్రమే పోలీసులు అడ్డుకుని కొట్టడంపై కూటమి శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశారు.. వివరాల్లోకి వెళితే.. చెందుర్తిలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వంగా గీత ఆపార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ప్రచారం చేస్తుండగా.. కూటమి శ్రేణులు మరోవైపు ప్రచారం చేపట్టారు. ఓ సందర్భంలో రెండువర్గాలు ఎదురెదురుగా వస్తుండటాన్ని గమనించిన పోలీసులు కూటమి శ్రేణులను అడ్డుకున్నారు. వారిని ప్రధాన రహదారిపైనే నిలిపేసి, వైకాపా ప్రచార ర్యాలీని ఒక వీధిలోకి పంపించారు. ఇదే సమయంలో కూటమి తరఫున ప్రచారానికి వచ్చిన డప్పు కళాకారుడు మణికంఠపై, గొల్లప్రోలు ఎస్సై బాలాజి చేయి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. కూటమి ప్రచార విషయంలో పోలీసులు తీరుపై ఎన్నికల అధికారులకు ఫి‡ర్యాదు చేస్తామని జనసేన నాయకుడు, న్యాయవాది కొంజర్ల అప్పారావు తెలిపారు. తనపై ఎస్సై దాడి చేశారని మణికంఠ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. తొలుత డప్పు కర్ర లాగేసుకున్నారని.. అనంతరం చెంపపై కొట్టారని చెప్పారు. ఎస్సై బాలాజీతో మాట్లాడగా.. తానెవరినీ కొట్టలేదన్నారు. డప్పు శబ్దాలకు మాటలు వినిపించడం లేదని.. ఆపాలంటూ గట్టిగా మందలించినట్లు స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని