logo
Published : 28/11/2021 01:37 IST

ప్రతిభ వెలికి తీసేందుకే పోటీలు


రేపల్లె : పోటీలు ప్రారంభిస్తున్న ఎంపీడీవో సువార్త, డాక్టర్‌ ప్రకాశరావు

చెరుకుపల్లి, న్యూస్‌టుడే : గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభ వెలికితీసేందుకు పోటీలు దోహదపడతాయని చెరుకుపల్లి ఎంపీపీ మత్తి దివాకర రత్నప్రసాద్‌ పేర్కొన్నారు. మండల స్థాయి సీఎం కప్‌ పోటీలు శనివారం గుళ్లపల్లి జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రారంభమయ్యాయి. ఎంపీపీ మాట్లాడుతూ.. ప్రతిభాంతులైన క్రీడాకారులకు ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం క్రీడా ప్రాంగణంలో రిబ్బన్‌ కత్తిరించి పోటీలు ప్రారంభించారు. హెచ్‌ఎం పులి లాజర్‌ మాట్లాడుతూ.. మండలంలోని 11 గ్రామాల నుంచి క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. మాజీ ఎంపీపీ చెన్ను కోటేశ్వరరావు, గుళ్లపల్లి ఎంపీటీసీ అమరేంద్ర, వైకాపా మండల కన్వీనర్‌ డి.వెంకటేశ్వరరెడ్డి, స్థానిక నాయకులు కాటూరి కృష్ణయ్య, చెన్ను శివమ్మ, జడ్పీటీసీ సభ్యురాలు మరివాడ వెంకటపావని పాల్గొన్నారు. హెచ్‌ఎం లాజర్‌, వ్యాయామోపాధ్యాయుడు ప్రసాద్‌ కార్యక్రమాలను పర్యవేక్షించారు.

రేపల్లె, న్యూస్‌టుడే : సీఎం కప్‌ టోర్నీకి క్రీడాకారుల ఎంపిక కోసం స్థానిక ఆర్సీ కళాశాల ప్రాంగణంలో శనివారం మండల స్థాయి ఆటల పోటీలు సందడిగా ప్రారంభమయ్యాయి. తొలుత పోటీలను ఎంపీడీవో సువార్త, ఎంసీఏ సభ్యుడు డాక్టర్‌ వేజళ్ల ప్రకాశరావు ప్రారంభించారు. వంద మీటర్ల పరుగు పందెంలో ఎస్‌.నవాబ్‌, ఎ.ప్రదీప్‌ మొదటి రెండు స్థానాలు సాధించారు. 200 మీటర్లలో బీవీ గోపి, జె.మురళీకృష్ణ, 400 మీటర్ల విభాగంలో సీహెచ్‌ వంశీ, సీహెచ్‌ సాగర్‌బాబు, 800 మీటర్లలో కె.ప్రవీణ్‌, డి.వీరగోపి, లాంగ్‌జంప్‌లో కె.నాగరాజు, ఎస్‌.నవీన్‌, డిస్కస్‌త్రోలో ఎం.భగత్‌, ఎస్‌.నవీన్‌, జావలిన్‌త్రోలో ఎం.భరత్‌, సీహెచ్‌ సాగర్‌ ప్రథమ, ద్వితీయ స్థానాలు కైవసం చేసుకుని నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని పీడీ రాఘవయ్య, శివనాగేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో ఇండియా రూరల్‌ ఇవాంజలికల్‌ ఫెలోషిప్‌ అధినేత రెబ్బా ఇమ్మానుయేల్‌, పీడీ చంద్రశేఖర్‌, పీఈటీలు పాల్గొన్నారు.

పిట్టలవానిపాలెం : చదువుతో పాటు క్రీడలకూ సమయం కేటాయించాలని పిట్టలవానిపాలెం ఎంపీపీ షేక్‌ బాజి అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీఎం కప్‌ మండల స్థాయి పోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభ గుర్తించేందుకు ఈ పోటీలు దోహదపడతాయన్నారు. మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు తరలివచ్చి పోటీల్లో తలపడ్డారు. జడ్పీటీసీ సభ్యురాలు సురేఖ, సర్పంచి అరుణకుమారి, ఈవోపీఆర్డీ పద్మజ, ఎంఈవో వుయ్యూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

చెరుకుపల్లి :కబడ్డీలో తలపడుతున్న విద్యార్థులు

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని