logo

నేటి నుంచి ఇంటర్‌ మూల్యాంకనం

ఇంటర్మీడియట్‌ ద్వితీయ ఏడాది ప్రధాన పరీక్షలు గురువారంతో పూర్తయ్యాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈనెల 11న జరగాల్సిన పరీక్ష తుపానుతో వాయిదా పడిన నేపధ్యంలో 25వ తేదీ జరగనుంది. బ్రిడ్జి కోర్సుల

Published : 20 May 2022 04:15 IST

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్‌ ద్వితీయ ఏడాది ప్రధాన పరీక్షలు గురువారంతో పూర్తయ్యాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈనెల 11న జరగాల్సిన పరీక్ష తుపానుతో వాయిదా పడిన నేపధ్యంలో 25వ తేదీ జరగనుంది. బ్రిడ్జి కోర్సుల విద్యార్థులకు ఈనెల 24వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. శుక్రవారం నుంచి పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభమౌతుందని ఆర్‌ఐవో బి.ఉమాదేవి పేర్కొన్నారు. గుంటూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మూల్యాంకనానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.

ఏపీ ఓపెన్‌ స్కూల్స్‌ సొసైటీ దూరవిద్య ఇంటర్మీడియట్‌ పరీక్షలు గురువారం ముగిశాయని జిల్లా సమన్వయకర్త కె.రవికుమార్‌ తెలిపారు. గురువారం పరీక్షకు మొత్తం 4700 మంది విద్యార్థులకుగాను 4254 మంది హాజరైనట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని